Horrible Accident : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సత్నా సరిహద్దులో ఆగివున్న రెండు బస్సులను ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి ఒక బస్సు రెండు భాగాలుగా విడిపోగా, మరొకటి నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదం ఎంపీలోని బర్కడ గ్రామంలోని మోహానియా టన్నెల్ వద్ద చోటు చేసుకుంది బస్సులో ప్రయాణిస్తున్న వారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ర్యాలీకి వెళ్లి తిరిగివస్తున్నట్లు సమాచారం.
MP | At least 5 dead, 20 injured after a truck hit 3 buses that were stationed at roadside in Sidhi district. Buses were carrying people returning from Union HM Amit Shah's rally.
Incident happened due to a tyre burst in truck. 5 dead, injured rushed to hospital: DM Sidhi pic.twitter.com/OUGc5W9gqa
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 24, 2023
ప్రమాదానికి ట్రక్కు టైర్ పగలడం కారణమని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో 10 నుంచి 20 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. రెండు బస్సులు సాత్నాలో జరుగుతున్న కోల్ మహాకుంభ్ పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.
#UPDATE | Madhya Pradesh: 8 people dead, 50 injured out of whom 15-20 people are seriously injured in a bus accident in Sidhi district: Rewa SP https://t.co/bTaP37iZSf pic.twitter.com/Ceb66lHs4s
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 24, 2023
ఈ ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు.
सीधी (म.प्र) में हुआ सड़क हादसा अत्यंत दुःखद है। इस हादसे में जान गंवाने वाले लोगों के परिजनों के प्रति गहरी संवेदना व्यक्त करता हूँ। ईश्वर उन्हें यह दुःख सहने की शक्ति दें। प्रशासन द्वारा घायलों को उपचार उपलब्ध कराया जा रहा है। घायलों के शीघ्र स्वस्थ होने की प्रार्थना करता हूँ।
— Amit Shah (@AmitShah) February 24, 2023
మృతులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. సిద్ధి లో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.