FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FASTag నిబంధనల్లో ఇవాళ్టి నుంచి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.. జాతీయ రహదారులపై టోల్ మినహాయింపు పొందే దివ్యాంగుల (PwD) కోసం జారీ చేసే FASTagల నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. కొత్త విధానం 2026 అక్టోబర్ 2 నుంచి అంటే ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది.. ఇకపై అర్హులైన దివ్యాంగులు తమ టోల్ మినహాయింపు FASTagను ప్రతి ఏడాది పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేసింది..
అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం FASTag చెల్లుబాటు వ్యవధిని లబ్ధిదారుడి వైకల్యం శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. వైకల్యం 70 శాతం నుంచి 100 శాతం వరకు ఉన్నవారికి FASTag 5 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది. అదే విధంగా 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ, 70 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నవారికి FASTag 3 సంవత్సరాల వ్యాలిడిటీతో జారీ చేస్తారు.. వైకల్యం శాతాన్ని నిర్ధారించేందుకు సంబంధిత ధ్రువీకరణ పత్రం, యూనిక్ డిజెబిలిటీ ఐడీ (UDID) కార్డు లేదా ప్రభుత్వం గుర్తించిన ఇతర చెల్లుబాటు అయ్యే పత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో, అర్హులైన లబ్ధిదారులు తరచూ పత్రాలను సమర్పించి FASTagను రెన్యువల్ చేసుకోవాల్సిన ఇబ్బంది తగ్గిపోనుంది..
Also Read
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
అయితే, ఈ టోల్ మినహాయింపు అన్ని వాహనాలకు వర్తించదు. దివ్యాంగుల వినియోగం కోసం ప్రత్యేకంగా రూపొందించిన, తయారు చేసిన అర్హత కలిగిన వాహనాలతో పాటు, దివ్యాంగుల యాజమాన్య వర్గంలో నమోదు చేసిన అర్హత కలిగిన వాహనాలకు ఈ సదుపాయం వర్తింపజేస్తారు.. గతంలో ప్రతి ఏడాది FASTagను పునరుద్ధరించాల్సి రావడంతో అర్హులైన లబ్ధిదారులు పత్రాల సమర్పణ, ధ్రువీకరణ వంటి ప్రక్రియలను పదేపదే పూర్తి చేయాల్సి వచ్చేది. ముఖ్యంగా దివ్యాంగులకు ఈ ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు.. అయితే 3 లేదా 5 సంవత్సరాల వ్యాలిడిటీ అంటే శాశ్వత టోల్ మినహాయింపు అని కాదు. నిర్ణీత గడువు పూర్తయిన తర్వాత FASTagను మళ్లీ పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో లబ్ధిదారుడి అర్హత, చెల్లుబాటులో ఉన్న వైకల్య ధ్రువీకరణ పత్రాలు, UDID కార్డు తదితర వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలిస్తారు. అందువల్ల లబ్ధిదారులు తమ సంబంధిత పత్రాలను అందుబాటటులో పెట్టుకోవాల్సి ఉంటుంది..
తాజావార్తలు
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!