NTV Telugu Site icon

Farooq Abdullah: మనీలాండరింగ్ కేసులో ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు

Farroq Abdullah

Farroq Abdullah

Farooq Abdullah: జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాకు మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. శ్రీనగర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు ఇదే కేసులో గత నెలలో సమన్లు అందాయి. ఈ కేసులో జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ నిధులు అసోసియేషన్ ఆఫీస్ బేరర్‌లతో సహా వివిధ వ్యక్తుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడినట్లు అభియోగం నమోదైంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ బేరర్‌లపై చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత 2018లో మనీలాండరింగ్ విచారణ ప్రారంభమైంది.

Read Also: Abu Dhabi: అబుదాబిలో తొలి హిందూ దేవాలయం.. ఎప్పుడు ప్రారంభమంటే..!

ఆ సమయంలో క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్‌గా ఉన్న అబ్దుల్లాపై ఈడీ 2022లో ఛార్జిషీట్ దాఖలు చేసింది.క్రికెట్ అసోసియేషన్ చీఫ్‌గా ఉన్న సమయంలో, అబ్దుల్లా గేమ్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో అధికారులు, ఇతరులకు వచ్చిన నిధులను మళ్లించారని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించారని ఆయనపై ఛార్జ్ షీట్ పేర్కొంది.ఈ నిధులను మొదట చాలా ప్రైవేట్ బ్యాంక్ ఖాతాలు, సన్నిహితులకు పంపారని ఛార్జిషీట్‌ ఆరోపించింది.

Show comments