NTV Telugu Site icon

Narendra Modi : ప్రధాని మోడీకి ముద్దు పెట్టిన రైతు

Former Kiss To Modi

Former Kiss To Modi

ప్రధాని నరేంద్ర మోడీ మీద అమితమైన అభిమానం చాటుకున్నాడు ఓ రైతు. ఆగి ఉన్న ఓ బస్సు మీద మోడీ ఫోటోని ప్రేమగా తడిమి చూసి ముద్దు పెట్టుకున్నాడు. ప్రధాని పట్ల ఉన్న అభిమానాన్ని తన మాటల్లో ఫోటోతో చెప్పుకున్నాడు. కర్ణాటకలో జరిగిన ఈ సన్నివేశాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read : Bhatti Vikramarka: ప్రజల కోసమే నా పాదయాత్ర.. వారి బాధలను ప్రభుత్వానికి చెప్పేందుకే..

ఓ రైతు చూడటానికి చాలా ఎమోషనల్ గా ఉన్నాడు. ఆడి ఉన్న బస్సు దగ్గరికి వచ్చాడు. బస్సుపై ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ముందు నిలబడి ఆప్యాయంగా తన చేతులతో తడిమి చూశాడు. మోడీతో మాట్లాడుతున్నట్లుగా తన మనసులో మాటను ఇలా ఫోటోకి చెప్పుకున్నాడు. ఇంతకు ముందు తనకి రూ. 1000 పెన్షన్ వచ్చేదని ఇప్పుడు అదనంగా 500 వస్తోందని, రూ. 5లక్షల రూపాయల ఆరోగ్య భీమాను మోడీ సర్కార్ అందిస్తోందని.. మాలాంటి నిరుపేదల ఇళ్లను పచ్చదనంతో నింపుతున్నావని.. మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నానని సదరు రైతు అన్నారు. నీవు చేసే మంచి కార్యక్రమాలతో మాలాంటి పేదల మనసు గెలుచుకున్నావని.. ఆ రైతు చెప్పుకున్నాడు. ఈ వీడియో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కి చేరడంతో ఆయన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు.

Also Read : Congress leader booked: ప్రధాని మోడీపై విమర్శలు.. కాంగ్రెస్ నేతపై కేసు..!

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి వీడియోలు ప్రచారం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి లబ్ధీ చేకూరే అవకాశాలు చాలా ఉన్నాయని జనం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.