Mulugu: గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన రైతు మృతి.. స్పందించిన మంత్రి
- ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో దారుణం.
- గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు మృతి.
- తన పేరు ఇళ్ల కోసం పెట్టిన అర్జిలో రాలేదని మనస్తాపం
- గ్రామ సభలోనే పురుగుల మందు తాగిన రైతు.
- రైతు మృతిపై స్పందించిన మంత్రి సీతక్క.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mulugu: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వరరావు అనే రైతు గ్రామ సభలో జరిగిన వాదనలపై మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామసభలో రకరకాల అంశాలపై చర్చ జరిగింది. ఈ సమయంలో, తన పేరు ఇళ్ల కోసం పెట్టిన అర్జిలో రాలేదని భావించిన నాగేశ్వరరావు మనస్తాపంతో గ్రామ సభలోనే పురుగుల మందు తాగారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను హన్మకొండలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు.
Also Read: Gannavaram Airport: గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు.. గన్నవరం నుంచి హైదరాబాద్ కి తిరుగు పయనం
Also Read
ఓ వారం పాటు చికిత్స పొందిన అనంతరం నాగేశ్వరరావు పరిస్థితి మరింత విషమించి, చివరకు మృతి చెందారు. మృతుడికి భార్య శాంతి, కుమార్తెలు పూజ, ప్రణతి, కుమారుడు కార్తీక్ లు ఉన్నారు. ఈ దారుణ సంఘటనపై మంత్రి వర్యులు సీతక్క విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన నాగేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగేశ్వరరావు పరిస్థితి విషమించడంతో ఎంజియం (ఎయిర్ ఎంబులెన్స్) అవసరం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించానని మంత్రి అన్నారు.
Also Read: Tamil Nadu: దారుణం.. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల అత్యాచారం
ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం, నాగేశ్వరరావు కుటుంబంతో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతుగా ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!