Lagacherla : రైతు ఈర్యా నాయక్‌కి బేడీల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్లు తెలుస్తోంది. వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సైబరాబాద్ పోలీసులకు జైలు అధికారులు సమాచారమిచ్చినట్లు విచారణ తేలింది. జైలు రికార్డులో ఈర్యా నాయక్ లగచర్ల కేసులో నిందితుడిగా కాకుండా బాలానగర్ లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నట్టు జైలు సిబ్బంది పేర్కొన్నారు. దీని వెనుక కూడా రాజకీయ కుట్ర కోణం ఉందని ఐజీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా చేశారా… పొరపాటు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Chhattisgarh Encounter: భారీ ఎన్‌కౌంటర్.. 7 మంది నక్సలైట్లు హతం
ఈ రోజు ఉదయం A2 సురేష్ జైల్లో వ్యవహరించిన తీరుతో అనుమానం మరింత పెరిగింది. 9 గంటల ప్రాంతంలో ఎవరితోనో సురేష్ ఫోన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈర్యాకి గుండె నొప్పి ఉంది లాయర్లు, మీడియాకి సమాచారం ఇస్తే గంటలో బైయిల్ వస్తుందని ఫోన్ లో సురేష్ చెప్పినట్లు,, సురేష్ ఎవరితో మాట్లాడరన్న దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఈర్యా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఐజీ సత్యానారాయణ.
Tollywood Rewind 2024 : దర్శక నిర్మాతలకు దీపావళి సినిమాలు నేర్పిన పాఠం