Site icon NTV Telugu

Dharani Portal : రైతులకు శుభవార్త.. ధరణిలో మార్పులు

Dharani

Dharani

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే.. ధరణి పోర్టల్‌లో భూయజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. (ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్- FAQ) టెక్నాలజీని పోర్టల్లో ఏర్పాటు చేయనున్నారు. రైతులు, అధికారులకు ఎదురైన సమస్యను పోర్టల్‌లో ఇచ్చే ఆప్షన్‌పై నమోదు చేస్తే దానికి ఏం చేయాలి, ఎవరిని కలవాలి, ఇంతకు ముందు అదే సమస్యకు అందుబాటులో ఉన్న పరిష్కారం ఏంటనేది అక్కడ కనిపిస్తుంది. అయితే.. ఇప్పటివరకు ఇలాంటి ఆప్షన్‌ ధరణిలో లేకపోవడంతో సమస్యలకు పరిష్కారం దొరకలేదు.

Also Read : Harish Rao : నేడు చెన్నూరుకు మంత్రి హరీష్‌రావు.. ముందస్తు అరెస్ట్‌లు

ఇప్పుడు ఈ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో భూయజమానులకు ఇది సహాయకారిగా మారుతుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు ధరణి జిల్లా కోఆర్డినేటర్‌ లేదా టోల్‌ఫ్రీ నంబర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలకు సరైన సమాధానం వెంటనే అందించేలా కొద్దిరోజుల్లో ఎఫ్‌ఏక్యూను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రెవెన్యూశాఖ తెలిపింది. ధరణి మొట్ట మొదటి సారిగా దేశములో ప్రప్రథమముగా తెలంగాణ ప్రభుత్వం ( భూ పరిపాలన శాఖ ) ఆరంభించింది . దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వం లో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, భూమి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు , ఆస్తుల బదిలీలకు జవాబుదారీతనం, సురక్షితమైన, ఇబ్బంది లేని ప్రజలకు సేవలను అందించడం ఈ పోర్టల్ లక్ష్యం.

Also Read : NCRB Data: జైళ్ల కెపాసిటీ 4.4లక్షలు.. కానీ ఖైదీలు 5.5లక్షలు

Exit mobile version