Site icon NTV Telugu

Rudra Karan Partaap : పదవీవిరమణ చేసే వరకు కేసీఆర్‎కు ఓటమి లేదు.. జ్యోతిష్కుడి ట్వీట్ వైరల్

Rudra Karan Partaap

Rudra Karan Partaap

Rudra Karan Partaap : కొద్దిరోజుల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అటువైపు కాంగ్రెస్ , బీజేపీ ఎలాగైనా కేసీఆర్ ను గద్దెదించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్కుడు రుద్ర కరణ్ పర్తాప్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు. రుద్ర కరణ్ పర్తాప్ జోస్యానికి ప్రాధాన్యత ఉన్నది. గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఆయన ముందుగానే కచ్చితమైన అంచనాను చెప్పారు. ఆయన అంచనాలే నిజమయ్యాయి. దీంతో తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఆయన చేసిన జోస్యానికి ప్రాధాన్యత సంతరించుకుంది. తనంత తానుగా పదవీవిరమణ చేసేంతవరకు కేసీఆర్ కు ఓటమి లేదని ఆయన స్పష్టం చేశారు.

Read Also:Shakunthalam: సమంత కష్టానికి కొంత ఫలితం అయినా వచ్చిందిగా…!!

‘నమో రుద్రాయా.. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వమే మళ్లీ అధికారాన్ని చేపడుతుంది. ఆ ప్రభుత్వమే తెలంగాణను పాలిస్తుంది’ అని రుద్ర కరణ్ పర్తాప్ మే 27వ తేదీన సాయంత్రం 7.38 గంటలకు ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇదిలా ఉండగా.. వేదిక్ అస్ట్రాలజర్ రుద్ర కరణ్ పర్తాప్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ముందే ఊహించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు.. ఎన్ని సీట్లను కైవసం చేసుకుందో కూడా ముందే జోస్యం చెప్పారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ఆయన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల (మే) 10వ తేదీన జరగ్గా.. అదే నెల 13వ తేదీన ఫలితాలు వచ్చాయి. రుద్ర కరణ్ పర్తాప్ తన ట్వీట్‌లో ఇలా పేర్కొన్నారు. మే నెల బీజేపీకి అనుకూలంగా లేదని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా బీజేపీ కంటే కాంగ్రెస్‌కే అధికంగా ఉన్నాయని అంచనా వేశారు. ఆయన అన్నట్లే అదే నిజమై సిద్ధరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

Exit mobile version