Site icon NTV Telugu

Tragedy: విషాదం.. 6 నెలల బాలుడితో పాటు ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య

Tragedy

Tragedy

Tragedy: అనంతపురం జిల్లా నార్పలలో విషాదం చోటుచేసుకుంది. నార్పల మండల కేంద్రంలోని మెయిన్ బజార్‌లో ఉన్న పెద్దమ్మ సామీ గుడి వద్ద ఉన్న ఓ ఇంటిలో ఆరునెలల బాలుడితో పాటు ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. తలుపులు పగులగొట్టి పోలీసులు ఇంటిలోకి వెళ్లారు. ఇంట్లో వేలాడుతున్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులు కృష్ణ కిషోర్, శిరీష, ఆరు నెలల బాలుడు జయంత్‌గా పోలీసులు గుర్తించారు. వారు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబ కలహాలు, అప్పులు, శత్రుత్వం కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read Also: Parents killed Son: దారుణం.. డబ్బు కోసం కుమారుడిని చంపిన తల్లిదండ్రులు.. ఎక్కడంటే?

Exit mobile version