రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్”.స్టార్ డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన క్యూట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది..విజయ్ దేవరకొండ ,పరశురామ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన “గీత గోవిందం”సినిమా సూపర్ హిట్ అయింది .దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఎన్నో అంచనాలతో ఫ్యామిలీ స్టార్ మూవీ “ఏప్రిల్ 5 ” న గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి షో నుంచే ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది .దీనితో ఈ సినిమా కలెక్షన్స్ పై బాగా దెబ్బ పడింది.
దీనితో ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చిన మూడు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేసింది. ఏప్రిల్ 26 నుంచి ప్రైమ్ వీడియోలో ఫ్యామిలీ స్టార్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటిటిలోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.థియేటర్స్ లో ఈ మూవీని మిస్ అయిన వాళ్లు ప్రైమ్ వీడియోలో చూస్తున్నారు. అయినా కూడా ఈ సినిమాపై ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు.ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కూడా కొన్ని సీన్లపై ట్రోలింగ్ జరిగింది. ఇక ఇప్పుడు ఓటిటి విషయంలో కూడా అదే జరుగుతోంది. సినిమాలోని కొన్ని సీన్ల గురించి చెబుతూ ఆ సీన్స్ మరీ సిల్లీగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రవిబాబుకు విజయ్ ఇచ్చే వార్నింగ్ పై సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో కొన్ని డైలాగులు ఫ్యామిలీ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదని తెలుస్తుంది .