Kaikaluru: ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ప్రచారం ఊపందుకుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు సమయం వృథా చేయకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. మద్ధతుగా వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఓ పక్క ప్రచారంలో దూసుకెళ్తుండగా.. మరోపక్క తన చిన్న కోడలు స్వాతి గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. కైకలూరు పట్టణంలో వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు గెలుపు కొరకు చిన్న కోడలు స్వాతి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
స్వాతి మాట్లాడుతూ.. ఇస్లాం పేటలో తిరుగుతుంటే ముస్లిం సోదరులు, సోదరీమణులు అందరూ స్వాగతిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటింటికి వెళ్లి వాళ్లను అడుగుతున్నప్పుడు ప్రతీ ఒక్కరు 90 శాతం పథకాలు అందాయని చెప్తున్నారన్నారు. మరలా కైకలూరులో రెండవసారి దూలం నాగేశ్వరరావును ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డిని రెండోసారి సీఎంగా చేసుకుంటామని అంటున్నారని అన్నారు. కైకలూరు ,మండవల్లి ,ముదినేపల్లి, కలిదిండి నాలుగు మండలాలు తిరిగానని.. ఎక్కడికి వెళ్లినా అందరూ దూలం నాగేశ్వరరావుకు మద్దతు ఇస్తామని చెప్తుంటే సంతోషం వేస్తుందన్నారు. ఎన్నికలు కొన్ని గంటల వ్యవధిలోనే ఉన్నాయని.. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయమని అభ్యర్థిస్తున్నానని అన్నారు. ఒక ఓటు అసెంబ్లీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావుకు, మరో ఓటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్‌కు వేయమని స్వాతి కోరారు.