Site icon NTV Telugu

Kurnool: కూతురు బ్రెయిన్‌డెడ్.. దుఃఖాన్ని దిగమింగుతూ పలువురికి ప్రాణదానం

Organs Donate

Organs Donate

Kurnool: ఓ వైపు అల్లుడిని కోల్పోయిన బాధ వారిని వెంటాడుతూనే ఉంది.. ఇప్పుడు కూతురు కూడా కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది.. అయితే, ఆ దుఃఖాన్ని దిగమింగుతూ పలువురు జీవితాల్లో వెలుగు నింపారు.. ఇంకా కొందరికి ప్రాణదానం చేశారు.. ఆ దంపతులు.. కర్నూలుకు చెందిన పావని లత అనే మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో కిడ్నీలు, కాలేయం, మూత్రపిండాలు, కళ్లు.. ఇలా అవయవాలను దానం చేశారు.

Read Also: Supreme Court: “పెళ్లి చేసుకోండి లేదా దత్తత తీసుకోండి.. వివాహ పవిత్రత మాకు ముఖ్యం”.. సరోగసీ కేసులో సుప్రీంకోర్టు..

పావని లత భర్త కొన్ని నెలల క్రితమే చనిపోవడంతో.. కుటుంబ పోషణకు ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లింది.. అప్పటికే మూర్ఛ వ్యాధి ఉన్న పావని లతకు మరోసారి ఫిట్స్ రావడంతో మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయి కోమాలోకి వెళ్లిపోయింది.. కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో.. హైదరాబాద్‌కు వెళ్లి పావని లతను కర్నూలు తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. కానీ, బ్రెయిన్‌ డెడ్‌ అయిపోయిన పావనిలత.. ఎప్పటి కోలుకుంటుంది.. కోమా నుంచి ఎప్పుడు బయటపడుతుందో తెలియని పరిస్థితి.. అయితే, బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానం చేయాలని రెడ్ క్రాస్ చైర్మన్ డా.గోవిందరెడ్డి.. పావనిలత పేరెంట్స్‌ని ఒప్పించారు. ఇక, పావని లత భర్త కూడా కొన్ని నెలల క్రితమే కిడ్నీ ఫెయిల్ కావడం, ట్రాన్సప్లాంటేషన్ చేయిద్దమన్నా కిడ్నీ దొరక్కపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి బాధ ఇంకొకరికి రాకూడదని కుటుంబసభ్యులు పావని లత అవయవాలుదానం చేశారు.

Read Also: Esha Deol: సూర్య హీరోయిన్ విడాకులు.. 12 ఏళ్ల కాపురానికి స్వస్తి

పావని లత చనిపోతూ పలువురికి ప్రాణదానం చేసింది. ఊపిరితిత్తులు హైదరాబాద్‌లోని కిమ్స్ కు, కాలేయం విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి, కిడ్నీలు కర్నూలు జీజీహెచ్‌, కర్నూలు కిమ్స్‌కు, కళ్లు రెడ్ క్రాస్‌కు దానం చేశారు. పావని లత భర్త కిడ్నీ చెడిపోయి చనిపోవడం, ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన కుటుంబ సభ్యులు.. కుమార్తె అవయవాలు దానం చేశారు. హైదరాబాద్, విజయవాడ నగరాలకు అవయవాలు సకాలంలో తరలించేందుకు వీలుగా గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే తండ్రి, ఇప్పుడు తల్లి పావనిలతను కూడా కోల్పోయింది ఆరేళ్ల చిన్నారి జ్యోత్న.. ఆ బాలిక చదువుకు ప్రభుత్వం సాయమ చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.అనాథ అయిన పావని లత కుమార్తె జ్యోత్నను చదివించే బాధ్యత నాదే అంటున్నారు రెడ్ క్రాస్ చైర్మన్ డా.కేజీ గోవిందరెడ్డి. ఇక, అవయవదానం పట్ల ప్రజలు చైతన్యులు కావాలని పిలుపునిచ్చారు కలెక్టర్ సృజన.

Exit mobile version