Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రూటే వేరు.. సమస్య అంటూ తన దగ్గరకు వచ్చిన వారిని అక్కున చేర్చుకుని.. వెంటనే వారి సమస్య పరిష్కారానికి పూనుకుంటారు.. తన దగ్గరకు వచ్చేవారికే కాదు.. దారిలో ఎవరైనా కనిపించినా కాన్వాయ్ ఆపి మరి పలకరిస్తారు.. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతాన్ని పరిశీలించారు.. అయితే, పవన్ వెళ్తున్న రూట్ లో తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు.. కొండెవరంలో గత వారం ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ కుటుంబ సభ్యులు.. వెంటనే కాన్వాయ్ ఆపి.. వాళ్లతో మాట్లాడి పవన్.. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు..
కాగా, యు కొత్తపల్లి మండలం కొండెవరంలో చక్రధర్ అనే యువకుడి ఆత్మహత్య సంచలనంగా మారింది.. 2021లో గ్రామానికి చెందిన మనీషా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న చక్రధర్.. మనీషా మైనర్ కావడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెండు నెలలు జైల్లోనే ఉన్నాడు.. ఆ తర్వాత మనీషాను తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయింది కుటుంబం.. జూన్ 16న మనీషా పుట్టినరోజు సందర్భంగా విషెస్ మెసేజ్ పెట్టాడు చక్రధర్.. ఇక, 22న పరీక్ష రాయడానికి తన అక్క ఇంటికి వచ్చింది యువతి.. అదే రోజు చక్రధర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. 22న ఆదివారం పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి విచారణ చేసి, తిరిగి సోమవారం రమ్మని చెప్పారు పోలీసులు.. కానీ, ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు చక్రధర్.. పోలీసులు ఇబ్బందులు, మనీషా కుటుంబ సభ్యుల వేధింపుల వల్ల తమకుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చక్రధర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. అయితే, విచారణలో భాగంగానే తీసుకొచ్చామని పోలీసులు చెబుతున్నారు.. మరి ఈ కేసులో ఏం తేలుతుందో చూడాలి.