False Tsunami Alert Goa: సునామీ.. ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నో ప్రాణాలు ఈ సునామీకి బలైపోయాయి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఊర్లకు ఊర్లే ఈ సునామీల కారణంగా తుడిచి పెట్టుకుపోయాయి. అయితే ఇప్పుడు దేశంలో అత్యంత రద్దీగా ఉండే టూరిజం స్పాట్ గోవాలో కూడా జనం సునామీ రాబోతుందను కొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికారు. అర్థరాత్రి మోగిన సునామీ సైరన్ వారి కంట కునుకు లేకుండా చేసింది. టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా మోగిన సైరన్ అక్కడ ఉన్న వారందరిని మాత్రం టెన్షన్ పెట్టింది
Also Read: G20 Dinner: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి అందని ఆహ్వానం.. జీ20 విందుకు వచ్చేది వీళ్లే..
వివరాల్లోకి వెళ్తే గోవా రాజధాని పనాజీ సమీపంలోని పోర్వోరిమ్ ప్రాంతంలో ఉన్న ఓ కొండపై ప్రభుత్వం సునామీ హెచ్చరికల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే సునామీ వచ్చే సూచనలు ఉంటే అది ముందుగానే పసిగట్టి విపత్తు గురించి అలర్ట్ చేస్తుంది. పెద్దగా సైరన్ మోత మోగిస్తూ జనాలను, అధికారులను అప్రమత్తం చేస్తుంది. అయితే బుధవారం రాత్రి 9 గంటల తరువాత ప్రమాద హెచ్చరికను తెలిపే అలారం కంటిన్యూస్ గా మోగింది. దాదాపు 20 నిమిషాల పాటు అది మోగుతూనే ఉంది. దీంతో సునామీ రాబోతుందని ప్రజలు భయంతో వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ గడిపారు.
అయితే దీనిపై స్పందించిన అధికారులు సునామీకి సంబంధించి వాతావరణ శాఖ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. అలాగే ఎక్కడ భూమి కంపించిన దాఖలాలు కూడా లేవని అధికారులు తెలపారు. వాతావరణ కేంద్రంతో పాటు భూకంప పరిశోధన కేంద్రం నుంచి కూడా తమకు దీనిపై ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొన్నారు. అయితే టెక్నికల్ ప్లాబమ్ వల్లే ఇలా జరిగి ఉండవచ్చని ఉత్తర గోవా జిల్లా కలెక్టర్ మము హెగే తెలిపారు. అయితే సైరన్ మోగడానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. టెక్నికల్ ప్రాబ్లమ్ ఏమో కానీ ప్రజలకు మాత్రం ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పని అయ్యింది.
