NTV Telugu Site icon

Fake VRAs : గద్వాల జిల్లాలో బయటపడ్డ నకిలీ వీఆర్ఏలు

Fake Vra

Fake Vra

గద్వాల జిల్లాలో నకిలీ వీఆర్ఏల గుట్టు రట్టైంది. గత కొన్ని ఏళ్ళుగా దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు చేస్తున్న నలుగురు వీఆర్ఏలు పట్టుబడ్డారు. దీంతో.. తహసీల్దార్, కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినెట్స్ గా నియమించడంతో నకిలీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ వీఆర్ఏలపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆర్టీఐ యాక్టివిస్ట్ విన్నవించారు.

Also Read : MLA Sudhakar: పవన్ కళ్యాణ్‌ని ఫ్యాన్స్ నమ్మొద్దు.. ఆయన్ను సినిమా వరకే చూడండి

తండ్రి చనిపోయాడని ఒకరు, తమకు తామే తలారులమని నకిలీ సర్టిఫికేట్లు సృష్టించి ఉద్యోగాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 8843/2006 పేరుతో ప్రొసీడింగ్స్… 6507 వరకే ప్రొసీడింగ్స్ ఉన్నట్లు నాటి డైలీ రిజిస్టర్ లో స్పష్టం చేశారు రెవెన్యూ అధికారులు. ఇదిలా ఉంటే.. భూస్వామ్య వ్యవస్థకు చిహ్నంగా మిగిలిన వీఆర్‌ఏ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ప్రకటించినట్టుగానే రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 20,555 మంది వీఆర్‌ఏలను సూపర్‌ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్‌ శాంతికుమారి సోమవారం వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేశారు.

Also Read : Video Viral: పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్.. అంజు, నస్రుల్లా వీడియో వైరల్