Tirumala: తిరుమలలో ఏపీ టూరిజం ముసుగులో నకిలీ టికెట్లతో భక్తులను ఓ ముఠా దర్శనానికి అనుమతిస్తోంది. నిత్యం 30 నుంచి 40 మంది భక్తులను టికెట్లు లేకుండానే ఏపి టూరిజం కోటాలో దర్శనానికి ముఠా అనుమతిస్తున్నట్లు తెలిసింది. చెన్నైకి చెందిన ట్రావెల్ ఏజెంట్, టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఏపి టూరిజం ఉద్యోగులు ముఠాగా ఏర్పడి దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 5 మందిపై కేసు నమోదు చేసి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నకిలీ టికెట్ల ముసుగులో పెద్దఎత్తున దందా సాగిస్తున్నట్లు సమాచారం.
Read Also: ఈ మొక్కలు ఇంట్లో పెంచుకుంటే స్వచ్ఛమైన గాలి.. ఆ సమస్యలకు చెక్..!