NTV Telugu Site icon

Fake Robbery: ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా.. సీన్ కట్ చేస్తే..?!

5

5

ఈ మధ్యకాలంలో యువత డబ్బు సంపాదించడానికి అనేక వక్రమార్గాలలో నడుస్తున్నారు. అలా వెళ్ళినవారు వారి సమయంతో పాటు డబ్బును కూడా పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా నేపద్యంలో యువతకు అనేక రకాల బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ లాంటివి అందుబాటులోకి రావడంతో యువత వాటికి ఆకర్షితులై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఓ యువతి ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Also read: Jr NTR’s look in WAR 2 : వార్2 ఎన్టీఆర్ లుక్ లీక్.. కటౌట్ అదిరింది!

పట్టపగలే ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా ఆడింది ఓ అమ్మాయి. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌ లో ఉన్న ఎర్రబోడ కాలనీలో ఓ ఇంట్లోకి దుండగులు చొరబడి.. బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు అపహరణ చేసినట్లుగా.. దాంతో తాను గట్టిగా కేకలు వేస్తూ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేసిన బాలికను తోసిసి దుండగులు పరారైనట్లు ఓ యువతీ మొదట అందరిని నమ్మించింది. కాకపోతే నిజం ఎక్కువ రోజులు ఆగదు అన్నట్లు.. సీన్ కట్ చేస్తే..

Also read: Rohith Sharma: స్టేడియంకు కారులో ఆకాష్ అంబానీతో పాటు రోహిత్ శర్మ.. కొత్త ట్విస్టులు ఏం లేవుగా..?!

సదరు యువతి స్కెచ్ బెడిసికొట్టింది. ఆన్‌లైన్ లో గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న యువతి ఇంత పెద్ద చోరీ డ్రామా క్రేయేట్ చేసింది. మొదటగా దొంగలు ఇంట్లోకి చొరబడి డబ్బులు అపహరించారని, భీభత్సం చేశారని మీడియా ముందు చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత సంఘటన జరిగిన వివరాలు అడిగి పొలీసులు విచారణ మొదలు పెట్టగానే.. అమ్మాయి చేసిన అసలు నిజం బట్టబయలయ్యింది. దింతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.

Show comments