Fake Police : ఐపీఎల్ టికెట్స్ కోసం ఓ వ్యక్తి సూడో పోలీస్ గా మారాడు.. 16 టికెట్లు కొనుగోలు చేసిన ఓ యువకుడిని బెదిరించి టికెట్లు తీసుకొని పారిపోయాడు.. సికింద్రాబాద్ బేగంపేట్ లోని జింకన్ గ్రౌండ్ వద్ద యాదగిరిగుట్టకు చెందిన రాకేష్ అనే యువకుడు తన మిత్రుల తో కలిసి 16 టికెట్లు బుక్ చేశారు.. జింకన్న గ్రౌండ్ HCA లో టికెట్లు తీసుకొని వెళ్తుండగా.. ఓ వ్యక్తి టికెట్లు కావాలంటూ వారిని ఆపాడు.. భారీగా డబ్బులు ఇస్తానంటూ చెప్పడంతో సరేనంటే ఇవ్వడానికి అంగీకరించగా, ఆన్లైన్ పేమెంట్ చేసినట్లు చూపించాడు. తమకు డబ్బు రాలేదని చెప్పడంతో, టికెట్లు వారి వద్దను చాలు తీసుకొని.. మీరు బ్లాక్ లో అమ్ముతున్నారు నేను పోలీస్ అంటూ, పోలీస్ స్టేషన్ కి రావాలంటూ కార్‌లో తీసుకువెళ్లాడు. బేగంపేట పోలీస్ స్టేషన్ చేరుకున్న తర్వాత మీరు ఇక్కడే ఉండండి అంటూ కారులో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంతసేపు వేచి ఉన్న రాకపోవడంతో మోసపోయామని భావించిన యువకులు బేగంపేట పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేశారు.. సిసి వీడియోల ఆధారంగా కారును గుర్తించిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Dancer Janu: నిన్న చావు, నేడు పెళ్లి.. ఢీ ‘జాను కథా చిత్రమ్’!