Robot Pregnancy: సైన్స్ సహాయంతో ప్రపంచం కొత్తకొత్త ఆవిష్కరణల వైపుగా పరుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ ఊహించనివిగా ఉన్నవి నేడు సర్వసాధారణం అవుతున్నాయి. పిల్లలు లేని జంటలు IVF ద్వారా తల్లిదండ్రులు అవుతారని మనందరికీ తెలుసు. కొన్ని రోజుల క్రితం చైనాకు చెందిన కుయ్ కే జీ అనే వార్తా సంస్థ, రోబోలు మానవ శిశువులను ఉత్పత్తి చేయడానికి అనుమతించే సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా అభివృద్ధి చేస్తోందని చెప్పడంతో ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. కానీ తర్వాతే ఓ ట్విస్ట్ వెలుగుచూసింది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Nepal Protest: నేపాల్ మాజీ ప్రధానిని రక్తం వచ్చేలా కొట్టిన ప్రజలు..
అంతా ఉత్తిదే..
ఈ వార్తపై ప్రత్యేక దృష్టిసారించిన తర్వాత లైవ్ సైన్స్ తల్లి గర్భాన్ని యంత్రంతో భర్తీ చేయగల అటువంటి సాంకేతికత ఏదీ అభివృద్ధి చేయలేదని పేర్కొంది. కానీ రోబోటిక్స్ కంపెనీ కైవా టెక్నాలజీ ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టుపై పనిచేయడమే కాకుండా ఈ సాంకేతికత దాదాపుగా పూర్తయిందని చెప్పుకుంటుంది. వాస్తవానికి ఈ నివేదికలో శాస్త్రవేత్తల పేర్లు బయటికి రాలేదు. లైవ్ సైన్స్ నివేదికలో సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం పేరు ఈ ప్రాజెక్టుతో ముడిపడి ఉంది. కానీ అక్కడ అలాంటి ప్రాజెక్టు ఏదీ జరగడం లేదని సమాచారం. అక్కడి విశ్వవిద్యాలయం వారు ఎలాంటి గర్భధారణ రోబోపై పనిచేయడం ప్రారంభించలేదని చెబుతున్నారు.
భవిష్యత్తులో అలాంటి టెక్నాలజీపై పని చేయవచ్చా అనే దానిపై యేల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని రిప్రొడక్టివ్ అండ్ ప్లాసెంటల్ రీసెర్చ్ యూనిట్ డైరెక్టర్ డాక్టర్ హార్వే కిల్మాన్ స్పందిస్తూ.. అలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేయలేమని చెప్పారు. గర్భధారణ సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులు, సవాళ్ల గురించి ఆలోచించినప్పుడు ఇది సాధ్యం కాదన్నారు. నిజానికి గర్భధారణ రోబోట్ కథ ఎలా వైరల్ అయ్యిందంటే.. చైనీస్ నివేదికలో చాలా పేర్లు ప్రామాణికమైనవిగా కనిపిస్తున్నాయి. ఇవి సైన్స్ ఫిక్షన్ లాగా ఉండటంతో, దీని కారణంగా ప్రజలు కూడా ఈ ప్రోటోటైప్ టెక్నాలజీని విశ్వసించారు. అయితే ఇప్పటి వరకు అలాంటి పరిశోధన సమాచారం ఏదీ బయటపడలేదు. ఈ వార్త సోషల్ మీడియాలోనే కాకుండా ప్రపంచంలోని ప్రధాన మీడియాలో కూడా ప్రచారం పొందింది. కానీ తాజా ఈ వార్త అబద్ధమని తేలింది.
READ ALSO: Morning Alarm: షాకింగ్.. డెంజర్ బెల్స్ మోగిస్తున్న అలారం..