NTV Telugu Site icon

Fake Loan Apps: ఏలూరులో ఫేక్ లోన్ యాప్ కేటుగాళ్ల అరెస్ట్

Loans 1

Loans 1

అవసరానికి లోన్ తీసుకుంటే.. నానా ఇబ్బందులు పెడుతున్నాయి లోక్ యాప్ లు. 10 వేలు లోన్ ఇచ్చి లక్షరూపాయలు లాగేస్తున్నారు. ఇంకా కట్టాలని వేధిస్తున్నారు. వాట్సప్ ల ద్వారా అశ్లీల మెసేజ్ లు పెట్టి నానా ఇక్కట్లు పాలు చేస్తున్నారు. ఫేక్ లోన్ యాప్ నిర్వాహకులు ఐదుగురిని అరెస్ట్ చేశారు ఏలూరు రూరల్ పోలీసులు.. లోన్ యాప్ ద్వారా 3వేలు లోన్ తీసుకున్న ఏలూరు రూరల్ ప్రాంతానికి చెందిన అప్పల భక్తుల నాగేంద్ర. 20యాప్ లలో 46వేలు లోన్ తీసుకున్న మరో బాధితుడు. ఇప్పటికే 3లక్షల 28వేలు చెల్లించిన బాధితుడిని కేటుగాళ్లు వదలలేదు.

Read Also: Kabul Classroom Bombings: ఆత్మాహుతి దాడి.. 46కు చేరిన బాలికల మృతుల సంఖ్య

ఇంకా ఇంకా కట్టాలని వేధిస్తూనే వున్నారు. డబ్బులు చెల్లించాలంటూ యాప్ నిర్వాహకుల వేధింపులు తారస్థాయికి చేరాయి. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వివిధ రాష్ట్రాల్లో వుండి ఫేక్ లోన్ యాప్ నిర్వహిస్తున్న వారిపై దృష్టి పెట్టారు వారి ఆట కట్టించారు పోలీసులు. ఫేక్ లోన్ యాప్ కి సంబంధించిన 33అకౌంట్ల లో 48కోట్లు లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన పోలీసులు నిర్వాహకులపై ఫోకస్ పెట్టారు.

చెన్నై కి చెందిన ముగ్గురు, హైదరాబాద్ కి చెందిన ఒకరు, ఏలూరుకి చెందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఏలూరు జిల్లా ఎస్పీ రాహూల్ దేవ్ శర్మ మీడియాకు తెలిపారు. ఎంత అవసరం వున్నా ఆన్ లైన్ యాప్ ల ద్వారా లోన్లు తీసుకుని ఇబ్బందులు పడవద్దని పోలీసులు సూచిస్తున్నారు.ఏమైనా ఇబ్బందులు పడుతుంటే వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయాలని ఎస్పీ సూచించారు.

Read ALso: Anti-Hijab Protest: ఈ అల్లర్లకు కారణం.. ఆ రెండు దేశాల కుట్రే!