Site icon NTV Telugu

Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో సంచలనం.. నంద్యాలకు చెందిన విలేఖరి కీలక పాత్ర

Fake Liquor

Fake Liquor

Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో నంద్యాలకు చెందిన యూట్యూబ్ విలేఖరి అల్లాబకాష్ కీలక పాత్ర ఉన్నట్లు పోలీసుల తేల్చారు. ఎక్సైజ్ అధికారులు అల్లాబకాష్‌ను అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అల్లాబకాష్ స్వగ్రామం గోస్పాడు (మం) జిల్లెళ్ళ. 20 ఏళ్లపాటు హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగాలు చేసిన అతడు.. ఏడాది క్రితం నంద్యాలకు వచ్చి, యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసుకుని విలేకరిగా చలామణి అవుతున్నాడు. హైదరాబాద్ లక్డీకపూల్ లోని సాయి పెయింటింగ్ ప్రెస్‌లో నకిలీ లేబుళ్లను తయారు చేశాడు. లేబుళ్లను ఇచ్చినందుకు ఫోన్ పే ద్వారా అల్లాబకాష్ ఖాతాలోకి నిందితులు డబ్బులు జమ చేశారు. మూడు రోజుల క్రితం ఎన్జీవో కాలనీలోని అల్లాబకాష్ ఇంట్లో సోదాలు చేసిన విజయవాడ ఎక్సైజ్ అధికారులు.. కంప్యూటర్లను సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని ఏ16గా గుర్తించారు. కోర్టు అల్లాబకాష్‌కు 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ మేరకు నిందితుడిని జైలుకు తరలించారు.

READ MORE: Gujarat Cabinet: 26 మందితో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం

Exit mobile version