Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనం అత్యాశనే వారికి పెట్టుబడి.. అదే వారి ఆయుధం.. తక్కువ ధరకు బంగారం వస్తుందన్న జనం ఆశను.. కాదు.. కాదు.. అత్యాశను సొమ్ము చేసుకున్నారు ఇద్దరు కేటుగాళ్లు. చక్కగా సాధువుల్లా తయారై ఊరి జనాన్ని 9 నెలల పాటు నమ్మించారు. వన్ ఫైన్ మార్నింగ్.. భారీగా డబ్బు తీసుకుని జంప్ అయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లిలో జరిగింది. డబ్బు పోగొట్టుకున్న బాధితులు ఇప్పుడు లబోదిబోమంటూ పోలీసుల ఆశ్రయించారు.
ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న వారి పేర్లు బోగా లక్ష్మీనారాయణ, సాయి కుమార్. భోగా లక్ష్మీనారాయణ స్వస్థలం ఎన్టీఆర్ జిల్లా నంద్యాల. కామేపల్లి మండలం భాసిత నగర్‌కు చెందిన సాయికుమార్‌తో కలిసి కెప్టెన్ బంజరలో మంచి చెడు కోసం పూజలు నిర్వహిస్తామని ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్ బంజరలో కొంతమంది అయ్యప్ప స్వామి మాల వేశారు. బోగా లక్ష్మీనారాయణ, సాయికుమార్ కూడా మాలవేసి ఆ గ్రామంలో పూజలు నిర్వహించారు. గత తొమ్మిది నెలలుగా కెప్టెన్ బంజర, బాసిత్ నగర్ గ్రామాలలో అయ్యప్ప స్వామి పూజలతో పాటు, ముత్యాలమ్మ జాతరను భోగ లక్ష్మీనారాయణ స్వామి సొంత ఖర్చుతో నిర్వహించాడు.
Also Read
- Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
- Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
- Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
ఇదే సమయంలో కామేపల్లి మండలంలోని లింగాల క్రాస్ రోడ్ వద్ద కోట మైసమ్మకు గుడి కట్టిస్తానని స్థలాన్ని కూడా కొన్నాడు బోగా లక్ష్మీనారాయణ. ఏడు లక్షల విలువలు చేసే స్థలాన్ని కొని నాలుగు లక్షల రూపాయలు కూడా చెల్లించారు. దీంతో ప్రజలు ఇతడు ఏది చెప్పినా నమ్మారు. ప్రజలలో ఒక నమ్మకం కలిగించిన తర్వాత బిస్కెట్ బంగారం తక్కువ ధరకు ఇస్తానని నమ్మించాడు.
గత తొమ్మిది నెలలుగా తమ గ్రామంలో నమ్మకం ఉంటూ అనేక పూజలు పండుగ కార్యక్రమంలో నిర్వహించినందున లక్ష్మీనారాయణ మాటలను నమ్మారు. తక్కువ ధరకు వస్తుందంటే ఆశతో లక్ష్మీనారాయణకు లక్షల రూపాయలు చెల్లించారు. కెప్టెన్ బంజర, బాసిత్ నగర్ గ్రామాలలోఅధికారికంగా 50 లక్షలు అంచనా తేలింది. కానీ గ్రామస్తులు కోటి రూపాయలు దాకా వసూలు చేశారని చెబుతున్నారు. అయితే ప్రజల నుంచి డబ్బు ముట్టగానే భోగా లక్ష్మీనారాయణతో పాటు సాయి కుమార్ కూడా అడ్రస్ లేరు. తమకు జరిగిన మోసంపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
-
Ratna Debnath: ‘నేను నా కూతురిని కోల్పోయా.. ఆమె తన కుర్చీని కోల్పోయింది’.. మమతపై ఆర్జీ కార్ బాధితురాలి తల్లి విమర్శలు
-
Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
-
OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
-
Zepto: దలాల్ స్ట్రీట్‌లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?