Zepto: దలాల్ స్ట్రీట్‌లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zepto: క్విక్ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ స్టార్టప్ సంస్థ ‘జెప్టో’ (Zepto) ఐపీఓకు రెడీ అవుతుంది. ఇప్పటికే స్విగ్గీ, జొమాటోలు దలాల్ స్ట్రీట్‌లో విజయవంతమైన ప్రయాణం కొనసాగిస్తున్న క్రమంలో.. ఇప్పుడు జెప్టో కూడా వాటి బాటలో దలాల్ స్ట్రీట్‌లోకి అడుగుపెట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ‘జెప్టో’ ఐపీఓ కోసం కంపెనీ దరఖాస్తు (DRHP) చేసుకుని, జూలై నాటికి మార్కెట్లోకి ఇష్యూను తీసుకురావాలని యోచిస్తోందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రయపడుతున్నారు. ఈ మెగా ఐపీఓ ద్వారా కంపెనీ ఏకంగా 1 బిలియన్ డాలర్లను (సుమారు రూ.8,300 కోట్లకు పైగా) సమీకరించే అవకాశం ఉంది. కాగా, ఈ ఇష్యూ నాటికి కంపెనీ మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.9.5 ట్రిలియన్ల (రూ.9.5 లక్షల కోట్లు) వరకూ ఉండవచ్చని అంచనా.
జూలైలోనే ఇష్యూ.. నిధుల విస్తరణే లక్ష్యం
10-నిమిషాల డెలివరీ ప్లాట్‌ఫామ్‌గా గుర్తింపు తెచ్చుకున్న జెప్టో, వచ్చే నెల (జూన్) చివరి నాటికి ఇన్వెస్టర్ల కోసం రోడ్‌షోలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓ ఆఫర్లో భాగంగా కొత్త షేర్ల జారీతో (Fresh Issue) పాటు, ప్రస్తుత ఇన్వెస్టర్ల షేర్ల సెకండరీ విక్రయం (OFS) కూడా ఉండనుందని చెబుతున్నారు. ఐపీఓ ద్వారా లభించే నిధులను కంపెనీ వ్యాపార విస్తరణకు, మౌలిక సదుపాయాల బలోపేతానికి ఉపయోగించనన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఐపీఓ పరిమాణం, టైమింగ్‌పై చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు, మార్కెట్ పరిస్థితులను బట్టి స్వల్ప మార్పులు ఉండవచ్చని అంతర్గత వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
- RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
- Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
ఈ ఏడాదిలోనే రెండో అతిపెద్ద ఐపీఓ
ఎస్బిఐ ఫండ్స్ మేనేజ్మెంట్ మెగా ఇష్యూ తర్వాత.. దేశంలో 1 బిలియన్ డాలర్ల మార్కును దాటనున్న రెండవ అతిపెద్ద ఐపీఓగా జెప్టో అవతరించనుంది. అంతర్జాతీయంగా ఇరాన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు కొంత స్తబ్దుగా మారిన తరుణంలో, జెప్టో ఐపీఓ భారతీయ ఐపీఓ మార్కెట్‌కు కొత్త ఊపును ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2026 లో ఇప్పటివరకు భారతీయ కంపెనీలు తొలిసారి షేర్ల అమ్మకాల (IPOs) ద్వారా మొత్తం 3.5 బిలియన్ డాలర్లను మాత్రమే సమీకరించాయి. ఇది గత రెండేళ్ల రికార్డు స్థాయిల కంటే చాలా తక్కువ కావడం గమనార్హం.
రూ.7 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్
గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఫండింగ్ రౌండ్లో జెప్టో $450 మిలియన్లను సేకరించి, $7 బిలియన్ల (సుమారు రూ.58,000 కోట్ల) వాల్యుయేషన్‌ను సాధించింది. ప్రస్తుతం ఈ స్టార్టప్ క్విక్ కామర్స్ మార్కెట్లో అమెజాన్ ఇండియా, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జొమాటోకు చెందిన బ్లింకిట్, టాటా గ్రూప్‌కు చెందిన బిగ్‌బాస్కెట్ (BB Now) వంటి దిగ్గజాలతో గట్టి పోటీని ఎదుర్కొంటుంది. ఈ ప్రతిష్టాత్మక ఐపీఓ ప్రక్రియను సక్సెస్ చేసేందుకు జెప్టో లీడ్ మేనేజర్లుగా.. యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్‌తో పాటు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాలైన మోర్గాన్ స్టాన్లీ, హెచ్ఎస్బిసి హోల్డింగ్స్, గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్‌ల స్థానిక విభాగాలతో కలిసి పనిచేస్తోంది.
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!