Fake Currency: నకిలీ నోట్ సామ్రాట్..
- అహ్మదాబాద్‌లో ఫేక్ కరెన్సీ ముఠా అరెస్ట్ ..
- అహ్మదాబాద్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ నేతృత్వంలో ఆపరేషన్..
- ముఠా వెనుక స్వయంప్రకటిత గాడ్‌మ్యాన్ ప్రదీప్ జోతంగియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌లో నకిలీ నోట్ల ముఠా భరతం పట్టారు పోలీసులు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ కేసులో కింగ్ పిన్‌గా ఉన్న వ్యక్తి సైతం పట్టుబడ్డాడు. అంతే కాదు .. తనకు తాను గాడ్‌మ్యాన్‌గా చెప్పుకుంటూ.. యోగాశ్రమం ముసుగులో ఫేక్ కరెన్సీ రాకెట్ నడిపిస్తున్న వ్యక్తిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఇంతకీ కంత్రీ గాడ్‌మ్యాన్ ఎవరు? అసలు ఫేక్ కరెన్సీ ముఠా బాగోతం ఎలా బయటకు వచ్చింది? వారు పేక్ కరెన్సీ ఎక్కడెక్కడ చలామణి చేశారు?
నకిలీ నోట్ సామ్రాజ్యం..
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఫేక్ కరెన్సీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆ ముఠా దేశవ్యాప్తంగా తమ నెట్‌వర్క్ ద్వారా పెద్ద ఎత్తున ఫేక్ కరెన్సీ చలామణి చేసిందనే విషయం బయటపడింది. మొత్తంగా ఈ ఆపరేషన్ అంతా.. అహ్మదాబాద్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్.. DCB నేతృత్వంలో జరిగింది. ఇందులో ప్రధాన సూత్రధారుడు స్వయంప్రకటిత గాడ్‌మ్యాన్ ప్రదీప్ జోతంగియా అలియాస్ ప్రదీప్‌జీతోపాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
నిజానికి పోలీసుల కళ్లుగప్పి ఈ నకిలీ నోట్ల ముఠా పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐతే ఇటీవల అహ్మదాబాద్‌లోని అమ్రైవాడి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వాహనాన్ని పోలీసులు అడ్డగించారు. ఆ వెహికిల్ తనిఖీ చేయడంతో రూ. 500 నోట్లు కట్టలు కట్టలుగా కనిపించాయి. ముందుగా అన్అకౌంటెడ్ మనీ అనుకున్నారు పోలీసులు. ఆ తర్వాత క్షుణ్నంగా తనిఖీ చేస్తే..ఫేక్ కరెన్సీ అని బయటపడింది. అందులోని వ్యక్తులను ఇంటరాగేషన్ చేయడంతో సూరత్‌లో నకిలీ నోట్ల ప్రింట్ చేస్తూ.. మర్కెట్లోకి వదులుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు సూరత్‌లోని కమ్రేజ్ ప్రాంతంలో ఉన్న శ్రీ సత్య యోగా ఫౌండేషన్‌లో సోదాలు నిర్వహించారు. అక్కడ ఏకంగా 2.38 కోట్ల రూపాయల విలువైన ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సత్య యోగ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్న ప్రదీప్ జోతంగియా తనకు తాను గాడ్‌మ్యాన్‌గా ప్రకటించుకున్నాడు. కోట్లాది మంది భక్తులను తయారు చేసుకున్నాడు. ఆ ముసుగులో ఫేక్ కరెన్సీ దందా స్టార్ట్ చేశాడు. తన ఆశ్రమంలోనే ఫేక్ కరెన్సీ నోట్లు తయారు చేస్తూ కస్టమర్లకు స్వయంగా డోర్ డెలివరీ చేస్తున్నాడు. దేశవ్యాప్తంగా తన సొంత వాహనాల్లోనే నకిలీ కరెన్సీ రవాణా చేస్తున్నాడు.
ప్రదీప్ జోతంగియా నేతృత్వంలోని ఈ ముఠా కేవలం గుజరాత్‌కే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా నకిలీ కరెన్సీ పంపిణీ చేసే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, పెద్ద ఈవెంట్ల సమయంలో మార్కెట్లో నకిలీ నోట్లను చలామణి చేసే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈ కేసు నేపథ్యంలో నకిలీ కరెన్సీ రాకెట్లపై రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!