Site icon NTV Telugu

Black Currency: విశాఖలో బ్లాక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు

Curency

Curency

విశాఖపట్నంలో నకిలీ కరెన్సీ నోట్లు చెలామణి జోరుగా సాగుతుంది. తాజాగా, నగరంలో బ్లాక్ కరెన్సీ ముఠా గుట్టురట్టు అయింది. నకిలీ కరెన్సీ చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నల్ల కాగితలను కరెన్సీ నోట్లుగా మారుస్తామంటూ మోసం చేశారు. బ్లాక్ కరెన్సీ ముఠాను టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక, ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్ పరిధిలోని కాకనినగర్ దగ్గర దొంగ నోట్ల మార్పడి డీలింగ్ జరుగుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. బ్లాక్ కరెన్సీ నోట్లుగా మార్చెంటుకు రెండు కెమికల్స్ వాడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. దొంగనోట్లు వ్యవహరంపై ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు.

Read Also: Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

అలాగే, ప్రస్తుతం దేశంలో రూ.31.92 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. జీడీపీలో వృద్ధి, ద్రవ్యోల్బణం, పాడయిన నోట్లకు బదులు కొత్త నోట్లను చెలామణిలోకి తేవడం, నగదుయేతర చెల్లింపుల సరళికి అనుగుణంగా ఆర్థికవ్యవస్థలో కరెన్సీ నోట్ల సంఖ్య ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని వెల్లడించారు. అందులో భాగంగానే, నల్లధనాన్ని అరికట్టేందుకు పరిమిత నగదు వ్యవస్థతో పాటు డిజిటల్‌ ఎకానమీని ప్రోత్సహించడం ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పుకొచ్చారు.

Exit mobile version