టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో తక్కువ టైం లోనే చేరింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరటం సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. . ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోస్ చుస్తే వావ్ అనాల్సిందే.. ఒకటికి మించి మరొకటి ఉన్నాయి… స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటున్నాయి.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఫెమస్ అయ్యింది.. ఇకపోతే తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ నటించి తనదైన గుర్తింపు తెచ్చుకుంది.. అయితే ఈ మధ్య తెలుగులో అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది. అయితే ఇటీవల తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.. ఇటీవల రకుల్ డేరింగ్ ఫొటోషూట్ తో మైండ్ బ్లాక్ చేసింది. మరోవైపు ‘మెట్రో పాలిటన్’ మ్యాగజైన్ కవర్ ఫొటోకు ఫొటోషూట్ చేసింది. ట్రాన్స్ ఫరెంట్ బ్లాక్ డ్రెస్ లో అదరగొట్టింది..
ఇదిలా ఉండగా.. ఈ అమ్మడు మొదటి సంపాదన గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. రకుల్ తన తొలి మోడలింగ్ రోజులను గుర్తుచేసుకుంటూ,’నా మొదటి షూటింగ్ సమయంలో చాలా సంవత్సరాలు నాకు 25 ఏళ్లు వచ్చే వరకు మా అమ్మ నాకు తోడుగా ఉండేది. నేను మోడలింగ్ చేసే రోజుల్లో నేను ఒక షూట్ కోసం రూ .5,000 మాత్రమే తీసుకున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ తమిళ చిత్రం ‘ఆయాలాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా ఓ మాదిరిగా ఉందనే టాక్ ను అందుకుంది.. నెక్ట్స్ ‘ఇండియన్2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కమల్ హాసన్ – శంకర్ కాంబోలో భారీ స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలోనే సినిమా విడుదల కాబోతుంది.. ఇకపోతే తన ప్రియుడితో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది..