నకిలీ నోట్ల ముఠాల ఆగడాలు శ్రుతి మించుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్రలో ఓ యువకుడు డబ్లింగ్ కరెన్సీ ముఠా చేతిలో హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది.పశ్చిమ గోదావరి జిల్లాలోఈ నెల 5న అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పెంటపాడు కాలువలో శవమై తేలిన పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామానికి చెందిన కేతా నరసింహ స్వామిగా గుర్తించారు. డబ్లింగ్ కరెన్సీ ఆశ చూపి నరసింహస్వామి నుంచి 3 లక్షలు కాజేశారు ఏడుగురు ముఠా సభ్యులు..తీసుకున్న డబ్బు గురించి నరసింహస్వామి ప్రశ్నించడంతో అతడిరి హత్య చేసిన గ్యాంగ్..కాలువలో పడేశారు. మృతుడి సెల్ ఫోన్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
అసలైన డబ్బులకి రెండింతలు నకిలీ కరెన్సీ అందజేస్తామని పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామానికి చెందిన కేతా నరసింహ స్వామి నుంచి 3 లక్షలు దోచేశారు. డబ్బులు గురించి పదేపదే ప్రశ్నిస్తుండడంతో నరసింహ స్వామిని ఈనెల 5వ తేదీన ముఠా సభ్యులు నిడదవోలు తీసుకువెళ్లారు. ఇంట్లో పని ఉందని చెప్పి వెళ్లిన నరసింహ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పెనుమంట్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆదివారం రాత్రి పెంటపాడు కాలువలో నరసింహస్వామి మృతదేహం లభ్యం అయింది.
సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా విస్తు గొలిపే నిజాలు వెలుగు చూశాయి. తీసుకున్న డబ్బు గురించి నరసింహస్వామి ప్రశ్నించడంతో అతడిని హత్య చేసిన ఏడుగురు సభ్యుల ముఠా గ్యాంగ్ మృతదేహాన్ని కాలువలో పడేశారు. మృతదేహం పెంటపాడు కాలువలో లభ్యం కావడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులు పోలీసులు ముందు లొంగిపోయారు. మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read Also: King of fruits: హాపుల రుచి అందని ద్రాక్షే.. మార్కెట్‌లో డజను ధర ఎంతంటే ?