Site icon NTV Telugu

Fake Currency: నకిలీ కరెన్సీ గ్యాంగ్‌కు చెక్‌ పెట్టిన పోలీసులు

Fake Currency

Fake Currency

Fake Currency: ఇటీవల నకిలీ కరెన్సీని చలామణి చేస్తూ కొన్ని ముఠాలు నేరాలకు పాల్పడుతున్నాయి. ఓ నకిలీ కరెన్సీ ముఠా ఆటలను కట్టించింది ఏలూరు జిల్లా పోలీస్‌ యంత్రాంగం. పది లక్షలు ఇస్తే రూ.44 లక్షల రూపాయలు ఇస్తామంటూ ఏలూరుకు చెందిన దొండపాటి ఫణి కుమార్ అనే వ్యక్తికి ఫోన్ చేసి ఆఫర్ చేసిన ఫేక్ కరెన్సీ ముఠా సభ్యులు. గత నెల 30వ తేదీన అడ్వాన్స్ కింద మూడు లక్షలు చెల్లించిన ఫణి కుమార్‌కు.. మిగతా అమౌంట్ చెల్లించగానే 44 లక్షలు అందిస్తామని ముఠా చెప్పింది. దీంతో మోసపోతున్నానని గమనించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ కరెన్సీ ముఠా ఆట కట్టించారు. నకిలీ కరెన్సీ ముఠా సభ్యులు మారుమూడి మధుసూదనరావు, బిరెల్లి రాంబాబులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.47 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

Read Also: Viral Video: ఫ్యాషన్ తగలెయ్య.. బాత్ రూమ్ టవల్ కట్టుకొని రోడ్డుపై ఆ యువతీ ఏకంగా.?

Exit mobile version