Site icon NTV Telugu

Fake Certificate: వ్యవసాయ శాఖలో నకిలీ సర్టిఫికేట్‌ల కలకలం

Fake

Fake

Fake Certificates: గద్వాల జిల్లా వ్యవసాయ శాఖలో నకిలీ సర్టిఫికేట్‌ల వ్యవహారం సంచలనం సృష్టించింది. ఫేక్ సర్టిఫికేట్‌లతో ఉద్యోగాలు పొందిన పలువురు అసిస్టెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు (AEO) అధికారుల గుట్టు బయటపడింది. వీరు ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయ విద్యను అభ్యసించినట్లు దొంగ డిగ్రీలు సృష్టించుకుని ఉద్యోగాల్లో చేరినట్లు గుర్తించారు. ఈ నకిలీ సర్టిఫికేట్ వ్యవహారంపై అధికారికంగా విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు ఏడుగురు ఉద్యోగుల నకిలీ డిగ్రీలపై అధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.

Read Also: Karan johar: రాజమౌళి సినిమాలపై కరణ్ జోహార్ వైరల్ కామెంట్స్

ఈ భారీ నకిలీ డిగ్రీల స్కామ్ వెనుక ఉన్న ముఠా నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కేంద్రంగా ఈ ఫేక్ సర్టిఫికేట్ దందా నడుస్తున్నట్లు గుర్తించారు. వివిధ యూనివర్సిటీల పేరుతో నకిలీ డిగ్రీలు తయారు చేసి, నిరుద్యోగులకు అమ్మే దందా జరుగుతోందని సమాచారం. పోలీసులు ఇప్పటికే అనేక నకిలీ సర్టిఫికేట్‌లను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ శాఖలో మాత్రమే కాకుండా, ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ ఇలాంటి నకిలీ డిగ్రీలు దారితీసే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఇలాంటి నకిలీ సర్టిఫికేట్ ముఠాలను పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version