Site icon NTV Telugu

Fake Baba: ఇంట్లో దెయ్యం ఉందని.. పూజల పేరుతో 29 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

Fake Baba

Fake Baba

Fake Baba: ఇంట్లో దెయ్యం ఉందని.. పూజల పేరుతో 29 లక్షలు కాజేశారు కొందరు కేటుగాళ్లు. హైదరాబాద్‌లోని గాంధీ నగర్ పోలీసులు నలుగురు దొంగబాబాలను అరెస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే.. గాంధీనగర్‌కు చెందిన జయనందిని ఫేక్‌ బాబా నివాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తన తల్లితో పాటు తనకు కొన్ని నెలలుగా ఆరోగ్యం బాగుండటం లేదని గాంధీనగర్‌కి చెందిన జయ నందిని అతనికి చెప్పింది. ఇంట్లో పూజలు చేయాలని నివాస్ ఆమె వద్ద నుంచి రూ.5000 తీసుకున్నాడు.

Read Also: SBI Donations: సీఎం సహాయనిధికి ఎస్‌బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం విరాళం

ఇంట్లో ఆత్మ తిరుగుతోందని.. దెయ్యం ఉందని చెప్పి పలు రకాల పూజల పేరుతో నివాస్ డబ్బులు దండుకున్నాడు. పలు దఫాలుగా జయనందిని నుంచి 28 లక్షల 32 వేలను నివాస్, కిన్నెర సాయి, ఈర్ణాల వాసు, ముషీరాబాద్‌కి చెందిన పురాణం నాగరాజు కాజేశారు. మోసపోయానని గ్రహించి జయనందిని గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి రూ.20 లక్షలను రికవరీ చేశారు. నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Exit mobile version