NTV Telugu Site icon

Fahadh Faasil: ‘పుష్ప’ విలన్ కేసు బుక్.. సుమోటో కేసుగా..?

Fahad Faasil

Fahad Faasil

Fahadh Faasil : ఫహద్ ఫాజిల్ పేరు చెబితే కొందరికి గుర్తుకు రాకపోవచ్చు.. కానీ., విలన్ “పుష్ప” లో పోలీస్ ఆఫీసర్ అంటే ఇట్టే గుర్తుకు వస్తాడు. అతను మలయాళ నటుడు. పుష్ప చిత్రం చివరలో “పార్టీ లేదా పుష్ప” అంటూ ఆయన చేసిన యాక్టింగ్ అందిరిలో ఇట్టే నిలిచిపోయింది. నిర్మాతగా పలు చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాలను అందించారు. అతను ఇటీవల బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఆవేశం’ లో నటించాడు. ఇకపోతే తాజాగా కేరళ మానవ హక్కుల సంఘం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు కూడా పెట్టారు.

Xi Jinping: ‘పంచశీల’, ‘అలీన విధానం’పై చైనా అధినేత ప్రశంసలు..

ఇక అసలు ఏం జరిగిందన్న విషయానికి వస్తే.. ఫహద్ నిర్మాతగా మలయాళంలో పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే ” పింకెలీ ” షూటింగ్‌ కు సంబంధించి అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆస్పత్రిలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. గురువారం రాత్రి అక్కడ షూటింగ్ చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎమర్జెన్సీ గదిలోకి షూటింగ్ చేయడంతో అసలేవని అక్కడికి ఎవరినీ అనుమతించలేదు. ఎర్నాకుళం జిల్లా వైద్యురాలు బీనా కుమారి ఎమర్జెన్సీ రూమ్‌లో షూటింగ్‌కి ఎలా అనుమతి ఇచ్చారని సీరియస్ అయింది. ఇందుకు సంబంధించి 7 రోజుల్లోగా విచారణ ఇవ్వాలని ఆదేశించింది.

T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ విజేత ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

ఓ వైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో షూటింగ్ జరగడంతో ఆరోపణలు రావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది రోగులు ప్రమాదకర స్థితిలో ఉన్నవారిని అత్యవసర గదికి వెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పారు. మరోవైపు ఈ ఆరోపణలను నిర్మాతల సంఘం ఖండించింది. రాత్రి షూటింగ్ కోసం రూ.10వేలు ఇచ్చామని చెప్పారు. అయితే మొత్తంగా ఈ కేసును సుమోటోగా చూసిన కేరళ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నిర్మాత ఫహద్ ఫాజిల్ పై కేసు పెట్టింది. త్వరలో ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. మరి ఈ కేసులో అంతిమంగా ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.