Site icon NTV Telugu

Mahua Moitra: లోక్సభ ఎంపీగా బహిష్కరణ.. సుప్రీంను ఆశ్రయించిన మహువా మోయిత్రా

Mahuva

Mahuva

‘క్యాష్ ఫర్ క్వైరీ’ కేసులో తనను పార్లమెంట్ సభ్యత్వం నుంచి బహిష్కరించడాన్ని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి బహుమతులు, అక్రమంగా లంచం తీసుకున్నట్లు ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను సభ ఆమోదించడంతో డిసెంబర్ 8న మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించారు. ఈ ఆరోపణలను టీఎంసీ నేత తీవ్రంగా ఖండించారు.

Read Also: Tammineni Sitaram: ఆర్కే ఎందుకు రాజీనామా చేశారో నాకు తెలియదు..

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎథిక్స్ కమిటీ నివేదికపై ఓటింగ్ నిర్వహించగా, దానిని మూజువాణి ఓటుతో ఆమోదించారు. లోక్‌సభ నుంచి తనను బహిష్కరించిన తర్వాత.. ఎథిక్స్ కమిటీ తన నివేదికలోని ప్రతి నిబంధనను ఉల్లంఘించిందని మహువా మోయిత్రా అన్నారు. ఇది బీజేపీ అంతానికి నాంది అని విమర్శించారు. ఈ క్రమంలో.. లోక్‌సభ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం.. మహువా మోయిత్రా హైకోర్టును ఆశ్రయించవచ్చు. అయితే ఆమె ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటులో ఆమోదించిన చట్టాలను సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు. మహువా నిర్దోషి అని తేలితే, ఆమె ఎంపీ హోదాను పునరుద్ధరించవచ్చు. దోషిగా తేలితే, ఎంపీని తిరిగి నియమించే అవకాశాలు ఉండవు.

Read Also: Narendra Modi: ఆర్టికల్ 370పై సుప్రీం తీర్పు.. మోడీ స్పందన

కాగా.. లంచం తీసుకుంటూ పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగిన ఆరోపణలపై మహువా మోయిత్రా దోషిగా తేలింది. బీజేపీ ఎంపీ వినోద్‌కుమార్‌ సోంకర్‌ నేతృత్వంలోని ఎథిక్స్‌ కమిటీ నవంబర్‌ 9న జరిగిన సమావేశంలో డబ్బులు తీసుకుని, సభలో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలపై లోక్‌సభ నుంచి మొయిత్రాను బహిష్కరించాలని సిఫార్సు చేసిన నివేదికను ఆమోదించింది.

Exit mobile version