NTV Telugu Site icon

Tamil Nadu: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు..నలుగురు కార్మికుల మృతి

New Project

New Project

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈరోజు ఉదయం ఓ ప్రైవేట్ బాణసంచా తయారీ యూనిట్‌లో పేలుగు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరికొంతమంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అచ్చంకుళంలోని చతుర్ తాలూకాకు చెందిన సహదేవ్ టీఆర్వో (TRO) లైసెన్స్‌తో తయారీ యూనిట్ నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. యూనిట్‌లో ఉంచిన రసాయనాలు, ఇతర ముడి పదార్థాలను సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణం ఇంకా తెలియరాలేదని తెలిపారు.

READ MORE: Monsoon Update: గుడ్‌న్యూస్.. మరో రెండు రోజుల్లో దేశమంతటా వ్యాపించనున్న రుతుపవనాలు

గత నెలలో వీరేద్‌నగర్‌లోని శివాక్సీ ప్రాంతం బాణసంచా కర్మాగారంలో ఇదే విధమైన పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందడం గమనార్హం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసి వారికి నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఇదే జిల్లాలో మరో బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడులో 10 మంది చనిపోయారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ మృతుల బంధువులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.