Accident : పూరీలో జగన్నాథుని చందన్ యాత్రలో బాణాసంచా పేలుడు.. 15 మందికి తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Accident : ఒడిశాలోని పూరీలో బుధవారం రాత్రి జగన్నాథుని చందన్ యాత్ర ఉత్సవాల్లో బాణాసంచా పేలడంతో 15 మందికి కాలిన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో నరేంద్ర పుష్కరిణి సరోవర్ ఒడ్డున వందలాది మంది ప్రజలు పూజలు చూసేందుకు గుమిగూడారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సందర్భంగా కొందరు భక్తులు బాణాసంచా పేలుస్తుండగా నిప్పురవ్వ పడి పేలుడు సంభవించింది. మంటలు చెలరేగుతున్న బాణాసంచా ఘటనా స్థలంలో గుమికూడి ఉన్న వారిపై పడిందని, కొందరు తమను తాము రక్షించుకునేందుకు రిజర్వాయర్లోకి దూకారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించామని, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుడు తెలిపారు.
Read Also:Astrology: మే 30, గురువారం దినఫలాలు
Also Read
- Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
- AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చికిత్సకు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి భరిస్తామని తెలిపారు. పూరీ నరేంద్ర పూల్ దగ్గర జరిగిన ప్రమాదం గురించి వినడం బాధాకరమని సీఎం నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందేలా చూడాలని, ఏర్పాట్లను పర్యవేక్షించాలని చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేస్తూ, ‘పూరీ చందన్ యాత్రలో నరేంద్ర పుష్కరిణి దేవిఘాట్ వద్ద జరిగిన దురదృష్టకర ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారనే వార్త విని బాధపడ్డాను. భగవంతుని ఆశీస్సులతో గాయపడిన వారు త్వరగా చికిత్స పొంది ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను.
Read Also:Fire Accident: ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. 16 కార్లు, 5 దుకాణాలు దగ్ధం
తాజావార్తలు
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
-
AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్తో వన్డే, టెస్ట్ సిరీస్ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్తో పాటు రీచార్జ్పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!