గాంధీ ఆస్పత్రిలో కాలం చెల్లిన మందులు కలకలం రేపుతున్నాయి. కాలం చెల్లిన మందులను పేషెంట్లకు డాక్టర్లు ఇచ్చారు. 2021లో గడువు ముగిసిన ఇన్సులిన్‌ను పేషెంట్లకు వైద్యులు ఇచ్చారు. అయితే.. ఇది గమనించడంతో ప్రాణాలు కాపాడుకున్నారు షుగర్ పేషెంట్లు. శాంపిల్స్ వెనుక డ్రగ్ మాఫియా హస్తం ఉందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాంధీ ఆస్పత్రి ఫార్మసీలో కాలం చెల్లిన మందులు లేవంటున్నారు గాంధీ అసుపత్రి వైద్యులు. పేషెంట్లకు ఎవరిచ్చారు అనే విషయంపై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నెల 10వ తేదీన గాంధీ హాస్పిటల్‌లో వైద్యులు డయాబెటిక్ పేషంట్ల కోసం ప్రత్యేకంగా ఓపీలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
Also Read : Cloth Planning: వారంలో ఏయే రోజుల్లో ఏ రంగు దుస్తులు ధరించాలి?
ఈ పరీక్షల అనంతరం మూడో అంతస్తులోని ఎండోక్రినలాజీ విభాగంలో పేషెంట్లకు షుగర్ కంట్రోల్ కోసం ఇన్సూలిన్ పెన్‌లను అందించారు వైద్యులు. ఈ శిబిరానికి వనస్థలిపురానికి చెందిన శివకుమారి అనే మహిళ వచ్చింది. అయితే.. ఆమెకు ఇచ్చిన ఇన్సూలిన్‌ను ఇంటికి వెళ్లి తరువాత ఇంజెక్షన్ చేసుకునే ముందు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో.. గాంధీ ఆసుపత్రి వైద్యులు అప్రమత్తమై ఈ విషయంపై ఆరా తీయగా.. ఫార్మసీ నుంచి ఎటువంటి షుగర్ ఇన్సులిన్‌లు అందించలేదని తెలిసింది. అయితే.. ఈ గడువు ముగిసిన శాంపిల్స్ ఎంతమందికి ఇచ్చారనేది ఇప్పటివరకు తెలియదు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Also Read : Foot Fetish: స్త్రీ పురుషుల మధ్య ప్రేమను పెంచే పాదాలు
