మోడీ సర్కార్ పై ప్రతిపక్షాల కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు మూడో రోజు చర్చకు రానుంది. ఎన్డీఏపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో మణిపూర్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారోనని ఉత్కంఠ నెలకొంది. విపక్ష కూటమి లేవనెత్తిన సమస్యలపై మోడీ సమాధానం ఇవ్వనున్నారు. కాగా, మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ ఏం మాట్లాడుతారు.. విపక్షాలకు ఎలా కౌంటర్ ఇస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: RBI Policy: నేడు MPC నిర్ణయాలను ప్రకటించనున్న రిజర్వు బ్యాంక్.. రెపో రేటు నో ఛేంజ్
ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై గత నెల 26వ తేదీన ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై మంగళవారం సభలో చర్చ ఆరంభమైంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్.. సహా ప్రతిపక్ష పార్టీల సభ్యులు దీనిపై మాట్లాడారు. ఎన్డీఏ పాలనలో దేశంలో సంభవిస్తోన్న పరిణామాలను ప్రస్తావించారు. ప్రధానంగా మణిపూర్ అల్లర్లనూ సభలో చర్చకు తీసుకువచ్చారు.
Read Also: Thursday Remedies: గురువారం నాడు ఈ నివారణలు చేస్తే.. ఊహించని డబ్బు మీ సొంతం!
అయితే, ఈ అవిశ్వాస తీర్మానంపై నేడు(గురువారం) ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వనున్నారు. మోడీ రిప్లై తరువాత ఈ తీర్మానంపై లోక్ సభలో ఓటింగ్ జరుగుతుంది. బీజేపీ-ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉండటం వల్ల ఈ తీర్మానం వీగిపోవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎన్డీఏకు 331.. బీజేపీకి సొంతంగానే 303 ఎంపీలు ఉన్నారు.. ఇక, విపక్షాల కూటమికి 144 మంది ఎంపీల బలం ఉంది. మరో 70 మంది ఎంపీలు తటస్థంగా వ్యవహరిస్తున్నారు.