NTV Telugu Site icon

Venkaiah Naidu: తెన్నేటి విశ్వనాథం అందరికీ ఆదర్శం

Rjy Venka

Rjy Venka

రాజకీయాల్లో విలువలు అత్యంత ప్రధానమైనవి అన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆంధ్ర కేసరి కళాశాలలో తెన్నేటి విశ్వనాథం విగ్రహాన్ని ఆవిష్కరించిన భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. మానవతా విలువలు ఉన్న మంచి తెన్నేటి విశ్వనాథం ‌…ఆయన మార్గం అందరికీ ఆదర్శం కావాలన్నారు వెంకయ్యనాయుడు. మాతృభాష అత్యంత ప్రధానమైనది. ప్రముఖులెందరో ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే విద్య నేర్చుకున్నారని గుర్తుచేశారు వెంకయ్యనాయుడు.

Read Also: Indra Karan Reddy: మహారాష్ట్రకు సీఎం కేసీఆర్..బీఆర్ఎస్ విస్తరణపై మంత్రి కీలక వ్యాఖ్యలు

ఇంగ్లీష్ భాష కూడా నేర్చుకోవడం మంచిది అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు గెజిట్లు, న్యాయమూర్తులు తీర్పులు కూడా తెలుగులో ఉంటే మంచిదన్నారు. రాజమండ్రి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రకాశం పంతులు, తెన్నేటి విశ్వనాథం ఉండే ఎంతో మంది చారిత్రక ప్రముఖులు రాజమండ్రి గడ్డపై నడయాడిన వారే అన్నారు వెంకయ్యనాయుడు. కాలేజీ అర్ధ శతాబ్ది ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సభలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Read Also: No Suitable Captain For Team india after Dhoni Live: ధోనీ తర్వాత టీమిండియాకు అసలైన కెప్టెన్ ఎవరు?