Site icon NTV Telugu

EX MLA Vishweshwar Reddy: హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌దే..

Vishweshwar Reddy

Vishweshwar Reddy

EX MLA Vishweshwar Reddy: చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి మోసం చేసేందుకే చంద్రబాబు సభలు పెడుతున్నారని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాయలసీమలో కరవు కాటకాలు ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు. హంద్రీనీవా ప్రాజెక్టు నేనే తెచ్చానంటూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.

Read Also: Galla Jayadev: ఇక రాజకీయాలకు దూరం.. ఎంపీ గల్లా జయదేవ్‌ సంచలన నిర్ణయం

హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించిన ద్రోహి చంద్రబాబు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌దేనని ఆయన చెప్పారు. హంద్రీనీవా ప్రాజెక్టును 40 టీఎంసీలకు పెంచిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఓ మోసగాడని.. ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధి కి అడుగడుగునా అడ్డుకున్నారని విమర్శలు గుప్పించారు.

Exit mobile version