Koneru Konappa: పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పుడు మరో నేత పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్‌ఎస్ నుంచి హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం.. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేయడంపై కోనేరు కోనప్ప ఆగ్రహంగా ఉన్నారు.
Read Also: Underwater Metro: దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో.. నేడు ప్రారంభించనున్న ప్రధాని
గత ఎన్నికల్లో కోనప్పపై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీ చేశారు. కేసీఆర్‌కు తాను ఎంతో గౌరవం ఇచ్చినా.. తనకు మాట మాత్రం చెప్పకుండా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంపై ఆయన అభ్యంతరం చెబుతున్నారు.నన్ను వ్యక్తిగతంగా దూషించిన ప్రవీణ్ కుమార్‌తో బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటారా.. అని ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. మంగళవారం కోనేరు కోనప్ప తన కార్యకర్తలతో రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. నేడు కోనేరు కోనప్ప తాను తీసుకునే నిర్ణయం వెల్లడిస్తారని తెలుస్తోంది.