Site icon NTV Telugu

TDP vs YSRCP: విడదల రజినీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆఫీసులపై దాడులు..

Vidadala

Vidadala

గుంటూరు పట్టణంలోని సాయిబాబా రోడ్డు దగ్గర మౌరియా ఫంక్షన్‌ హాల్‌ లో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి విడదల రజినీ, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయాలపై టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున దాడులకు దిగారు. బైక్‌లు కార్లలో వేలాది మంది కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అటుగా వెళ్తూ రజినీ కార్యాలయం దగ్గరకు రాగానే పెద్ద ఎత్తున రాళ్లు రువ్వడంతో ఆఫీసు కార్యాయాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

Read Also: Punjab: ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు, ఖలిస్థాన్ మద్దతు దారుల ముందంజ

అలాగే, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆఫీసుపై తెలుగు దేశం పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. చాలా సార్లు లాఠీ ఛార్జీకి పాల్పడినప్పటికీ మళ్లీ మళ్లీ దాడులు చేశారు. ఇదే రహదారిలో టీడీపీ వాహనశ్రేణి ఇంకా కొనసాగుతూనే ఉండటంతో ఇక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఇక, పోలీసులు వారిని చెదరగొట్టేందుకు అదనపు బలగాలను మోహరించారు. అయితే, గుంటూరులో 144 సెక్షన్ ను విధించారు.

Exit mobile version