NTV Telugu Site icon

KS Jawahar: మంత్రి సురేష్ జగన్ కు మాత్రమే విశ్వాసపాత్రుడు

మంత్రి ఆదిమూలపు సురేష్ వైఖరిపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. మంత్రి సురేష్ తండ్రి దళితుల ఆత్మగౌరవం కోసం గుర్రాలపై తిరిగితే, నేడు కొడుకు దళితుల ఆత్మగౌరవాన్ని జగన్ కు తాకట్టుపెట్టడానికి బట్టలిప్పి తిరిగాడు. సురేష్ తనచర్యతో దళిత జాతిని జగన్ కాళ్లవద్ద తాకట్టు పెట్టాడనే చెప్పాలి. తన తప్పు ఒప్పుకొని సురేష్ తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంత్రి సురేష్ ఏ1గా ఉంటే, అతని భార్య ఏ2గా ఉంది. ఆ కేసుని చూపి భయపెట్టే, జగన్ నిన్న సురేష్ తో అర్థనగ్న ప్రదర్శనలు చేయించాడు.

Read Also:The OG: ఇదెక్కడి ‘మాస్’ జోష్ బ్రో… OG కోసం ఏకంగా బిర్యానీలు పంపిస్తున్నావ్

బట్టలు లేకుండా నడి వీధుల్లో తిరిగిన సురేష్, తన చర్యతో దళితుల ఆత్మగౌరవాన్ని అపహాస్యం చేశాడు.సురేష్ చొక్కాలు విప్పడానికి కారణం జగన్ భయమా.. లేక తన ఆస్తులపైకి సీబీఐ వస్తుందన్న భయమా?సురేష్ జగన్ కు విశ్వాసపాత్రుడు తప్ప, మాదిగలకు కాదు.జగన్ ప్రభుత్వంలో విచ్చల విడిగా సాగుతున్న ఇసుక మాఫియాపై ప్రశ్నించిన వరప్రసాద్ కు శిరోముండనం జరిగినప్పుడు సురేష్ చొక్కా విప్పితే దళితజాతి హర్షించేది.డాక్టర్ సుధాకర్ మొదలు డాక్టర్ అచ్చెన్న వరకు ఎందరో దళితుల్ని జగన్ బలి తీసుకున్నప్పుడు సురేష్ నోరు ఎత్తిఉంటే దళితులు గర్వంగా ఫీలయ్యేవారు.దళిత మహిళల మానాలు, ప్రాణాలు జగన్ ప్రభుత్వంలో బలైపోతున్నప్పుడు, మంత్రి హోదాలో సురేష్ ముఖ్యమంత్రిని ప్రశ్నించి ఉంటే, దళిత జాతి రొమ్ము విరిచేది అన్నారు మాజీ మంత్రి కేఎస్ జవహర్.

Read Also: Medico Preethi Case: ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం: ప్రీతి తండ్రి