Site icon NTV Telugu

Kodali Nani Challenge: చంద్రబాబుకి నాని సవాల్.. ఇవే చివరి ఎన్నికలు!

Kodali Nania

Kodali Nania

ఏపీలో ఇంకా ఎన్నికలు రానేలేదు.. కానీ ఎన్నికల వేడి మాత్రం రాజుకుంటోంది. 17 నెలల తర్వాత గానీ ఎన్నికల నగారా మోగేది లేదు. కానీ ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంటోంది. నిత్యం చంద్రబాబునాయుడిని, టీడీపీని తన ఘాటు విమర్శలతో ఏకిపారేసే మాజీ మంత్రి కొడాలి నాని మరోమారు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు జీవితకాలం సమయం ఇస్తున్నాం.. పులివెందుల నియోజకవర్గంలో ఒక్క పంచాయతీ అయినా గెలవగలడా..? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నారావారిపల్లెలో గెలవలేని చంద్రబాబు కుప్పంలో ఎలా గెలుస్తాడన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

Read Also: Sneha: షాకింగ్.. హీరోతో స్నేహ విడాకులు..?

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు 2024 చివరి ఎన్నికలని ఎద్దేవా చేశారు. ఎన్నికల తరువాత పవన్‌ జెండా పీక్కొని పారిపోతాడన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దెబ్బకు చంద్రబాబు, పవన్, లోకేష్‌ రాజకీయ అనాథలుగా మిగిలారన్నారు. జనసేన పార్టీని పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబుకు అంకితం చేశాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సమస్యలు లేకనే ఇప్పటంపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. పవన్ టూర్ పై ఆయన మండిపడ్డారు. విపక్ష నేత చంద్రబాబుకు కొడాలి నాని మరో సవాల్‌ విసిరారు. ‘అరబిందో సంస్థతో నీకు సంబంధం లేదని ప్రమాణం చేయగలవా..? 2009–19 వరకు అరబిందో నుంచి చంద్రబాబు పార్టీ ఫండ్‌ వసూలు చేశాడు’ అని చెప్పారు. లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టయిన వారిలో ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు లేడని కొడాలి నాని అన్నారు.

Read Also: James Cameron: జేమ్స్ కేమరాన్ భయపడుతున్నాడా? భయపెడుతున్నాడా??

Exit mobile version