Secunderabad: హైద్రాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపుకి సర్వం సిద్ధమైంది. మొత్తం 21లక్షల 20వేల 401 ఓట్లకు గాను పోలైన ఓట్లు… 10 లక్షల39 వేల 843 కాగా.. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి 46 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 కేంద్రాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు.. 3 ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అత్యధికంగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్ కి 20 టేబుళ్లు, మిగిలిన 6 నియోజకవర్గాలకు 14 చొప్పున మొత్తం 119 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా ముషీరాబాద్, నాంపల్లి సెగ్మెంట్ లలో 20 రౌండ్ ల లెక్కింపు మొదలు కానుంది.
Read also: Peddapalli: పెద్దపెల్లిలో ఓట్ల లెక్కింపుకు పూర్తైన ఏర్పాట్లు..
ఖైరతాబాద్ 18, అంబర్పేట్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నియోజకవర్గాల్లో 17, సికింద్రాబాద్ 16 రౌండ్ ల కౌంటింగ్ ఏర్పాటు చేశారు. ముందుగా పోలైన 8472 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, హోం ఓటింగ్ లో 367 ఓట్లను లెక్కించనున్న అధికారులు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు 12 గంటల వరకు ప్రకటించనున్న ఆర్వో. పూర్తి ఫలితాలు మధ్యాహ్నం 3-4 గంటల వరకు ప్రకటించే అవకాశం ఉంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత.. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ అధికారులు నిర్వహించనున్నారు.
Karimnagar: కరీంనగర్ లో కౌంటింగ్ కోసం సర్వం సిద్ధం..