NTV Telugu Site icon

Nalgonda: నల్గొండ జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్ధం

Chandigarh Mayor Polls

Chandigarh Mayor Polls

నల్గొండ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నల్గొండ లోక్ సభ లో పురుషుల కంటే మహిళ ఓట్లే అధికం ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నల్గొండ పార్లమెంటు పరిధిలో మొత్తం 17,25,465 మంది ఓటర్లు ఉన్నారు. మహిళా 8,80,453, పురుషుల 844843 ఓటర్లు ఉన్నారు. నల్గొండ పార్లమెంట్ స్థానానికి 22 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నేడు పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు పంపిణీ చేయనున్నారు.

READ MORE: Odisha: ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పాలంటూ మోడీ సవాల్.. సీఎం పట్నాయక్ రియాక్షన్..!

నల్లగొండ పార్లమెంట్ లో మొత్తం 2061 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఎన్నికల నిర్వహణ కోసం 2061 టీం లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 5150 బ్యాలెట్ యూనిట్లు, 2575 కంట్రోల్ యూనిట్లు, 2883 వి వి ప్యాట్ లు పంపిణీ చేయనున్నారు. డీసీఆర్ ల నుంచి సిబ్బంది తరలింపునకు 1925 వాహనాలను సిద్ధ చేశారు. 2435 బృంధాలు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నాయి. మరో 374 టీంలు రిజర్వు ఫోర్స్ అందుబాటులో ఉంటాయి. నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఏడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ల ఏర్పాటు. ఈవీఎం వాహనాలకు జీపీఆర్ఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశారు. నల్లగొండ ఎన్నికల నిర్వహణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2600 మంది సివిల్ పోలీసులు, 250 మంది శిక్షణ కానిస్టేబుల్స్, (600)ఏడు కంపెనీల కేంద్రబలగాలు రంగంలోకి దిగాయి. భువనగిరి నియోజక వర్గ పరిధి లో మొత్తం 18,08,585 ఓట్లు ఉండగా అందులో మహిళలు 8,98,416 పురుషులు 9,10,090, ఇతరులు 79 ఉన్నారు. 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2141 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 8023 బ్యాలెట్ యూనిట్లు ఉండగా.. కంట్రోల్ యూనిట్స్ 2673, వివి ప్యాట్స్ 2994 ఉన్నాయి. 10,140 మంది అభ్యర్థులు పోలింగ్ విధుల్లో పాల్గొంటారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యల తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో గొడవలు సృష్టించిన వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పలువురి బైండోవర్ చేశారు. వేసవి కావడంతో కేంద్రాల వద్ద ఓటర్లకు పలు రకాల వసతులు ఏర్పాటు చేశారు. నీడ, నీరు ప్రధానంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.