China: చైనాలో రియల్ ఎస్టేట్ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఎవర్‌గ్రాండే క్రాష్‌తో ఇది ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ నుంచి కంపెనీ ట్రేడింగ్ నిలిచిపోయింది. ఇది గత నెలలోనే ప్రారంభమైంది. అయితే కంపెనీ షేర్లు ప్రారంభంలో క్షీణించిన తర్వాత, పరిస్థితి మెరుగుపడినట్లు కనిపించింది. అయితే సోమవారం హాంకాంగ్ మార్కెట్ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే కంపెనీ షేర్లు 25 శాతం మేర కుప్పకూలాయి. రూ.2200 కోట్ల మేర నష్టపోయినట్లు కంపెనీ ఇన్వెస్టర్లు తెలిపారు. కంపెనీ మనీ మేనేజ్‌మెంట్ యూనిట్‌లోని ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కంపెనీ షేర్లు 25 శాతం క్షీణించాయి. పోలీసులు నిర్వహిస్తున్న కొత్త దర్యాప్తు రియల్ ఎస్టేట్ మార్కెట్ దిగ్గజానికి కొత్త సమస్యలను సృష్టించవచ్చు.
Read Also:Mohammad Siraj: నాకు ఓ మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్‌తో 7 ఓవర్లే వేయించా: రోహిత్ శర్మ
ఉదయం ట్రేడింగ్‌లో స్టాక్ 25 శాతం పడిపోయి రెండు వారాల కనిష్ట స్థాయి అయిన 0.465 హాంకాంగ్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ షేర్లు ఈరోజు 0.560 హాంకాంగ్ డాలర్ల వద్ద ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ షేర్లు కూడా 0.680 హాంకాంగ్ డాలర్ల వద్ద గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చైనా కాలమానం ప్రకారం ఉదయం 9:35 గంటలకు కంపెనీ షేర్లు 0.465 హాంకాంగ్ డాలర్లకు చేరుకున్నాయి. చైనా కాలమానం ప్రకారం.. ఇది 11.02 నిమిషాలకు 0.63 హాంకాంగ్ డాలర్‌కు వచ్చింది. 5 నిమిషాల్లోనే కంపెనీ షేర్లు రూ.25 తగ్గడంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. భారతీయ రూపాయలలో చూస్తే కంపెనీ తన మార్కెట్ క్యాప్ నుండి 2200 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఇన్వెస్టర్లు 207 కోట్ల హాంకాంగ్ డాలర్లను కోల్పోయారు. హాంకాంగ్ స్టాక్ మార్కెట్‌లో కంపెనీ మార్కెట్ క్యాప్ 8.319 బిలియన్ హాంకాంగ్ డాలర్లు. రాబోయే రోజుల్లో కంపెనీ షేర్లు పతనం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also:Nipha Virus: కేరళలో కాస్త శాంతించిన నిఫా వైరస్.. రెండు రోజుల్లో జీరో కేసులు