మేము ఓడినా ప్రజలకు కోసం మేము పోరాటం చేస్తామని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. వాలంటరీ వ్యవస్థను కుడా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వంపై మేము ప్రజల తరుపున పోరాటం చేస్తామని తెలిపారు. రేపు పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఉందని.. రేపు వృద్ధులకు, 7 వేలు పింఛన్ చంద్రబాబు ఇస్తామన్నందుకు సంతోషమన్నారు. రేపటి దినం దివ్యాంగులకు 15 వేల రూపాయలు ఇస్తానని తాను ఆశించినట్లు చెప్పారు. కానీ 7 వేలు మాత్రమే ఇస్తారన్నారన్నారు. పింఛన్ లో కోతలు పెట్టి రేపు పంపిణీ చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు డిమాండ్ చేశారు. మేము ఎన్నికల్లో ఓడి పోయామని.. ప్రజలు మోసపోయారన్నారు. ఈ అయిదు సంవత్సరాలు ప్రజలు మోసపోతూనే ఉంటారన్నారు.
READ MORE: Rishi Sunak: ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పూజలు..హిందుత్వం నుంచే ప్రేరణ పొందానని వ్యాఖ్య
కాగా.. సామాజిక పింఛనుదారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే వారి ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ముందడుగు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్టు పింఛను మొత్తాన్ని ఒకేసారి రూ.1000 పెంచామని, ఇకపై నెలనెలా రూ.4వేలు అందిస్తామని పేర్కొన్నారు. దివ్యాంగులకు రూ.3వేలు పెంచి ఇకనుంచి రూ.6వేలు అందిస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పథకం పేరుతో ఇక పింఛన్లను అందించనున్నట్టు వివరించారు.