గత కొన్ని రోజులుగా నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలను, ముంపుకు గురైన గ్రామాలను, వర్షం ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి వస్తున్న బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పర్యటించనున్నారు.రేపు మధ్యాహ్నం 01.30 గంటలకు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి ఈటల రాజేందర్ చేరుకుంటారు. భోజనం అనంతరం నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలంలో మలక్ చించోలి బ్రిడ్జి, సోన్ మండలం జాఫ్రాపూర్, అనంతరం కడెం ప్రాజెక్టును ఈటల రాజేందర్ సందర్శించనున్నారు. ఇదిలా ఉంటే.. ఇవాళబీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ కు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. నా జీవితం తెరిచిన పుస్తకమని, నాలాంటి వాడు ఎలాంటి పదవిలో ఉన్నా.. నిజమైన అర్హులకు లబ్దిచేకూర్చే పని చేస్తున్న. నేను మీ కుటుంబంలో సభ్యున్ని అని ఆయన అన్నారు. మీ ఆశీర్వాదం కావాలని కోరుతున్న. అదే నాకు కొండంత అండ. మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ మీ ప్రేమ అనంతం. వెల కట్టలేనిది. మీ ప్రేమను నా గుండెల్లో పెట్టుకుంటా.. మీకు ఎం చేయాలో మర్చిపోనని ఆయన వెల్లడించారు.
Also Read : Pakistan Blast: పాకిస్తాన్లో బాంబు పేలుడు.. 40 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు
అంతేకాకుండా.. ‘ఇందిరా పార్క్ ప్రతి టెంటును పలకరించిన వడిని నేను. పంచాయితీ సెక్రటరీలు, గ్రామ పంచాయితీ సిబ్బంది,VRA, VRO, జీఓ నంబర్ 46 వల్ల ఇబ్బంది పడుతున్న కానిస్టేబుల్స్ ఒకటే రాష్ట్రంలో ఒకే కులంలో పుట్టిన వారికి ఉద్యోగాలు ఇవ్వడంలో వ్యత్యాసం ఉంది. ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులు చేసే ఆర్తనాదాలు వినే సమయం లేదు. ప్రగతి ముట్టడి చేస్తే కొడుతున్నారు. మమ్ముల్ని కొట్టండి కానీ మా పొట్టమీద కొట్టవద్దు అని విద్యార్థులు కోరుతున్నారు. నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాల భర్తీ అవ్వక యువతకు పిల్లలు ఇచ్చే దిక్కులేదు.. పెళ్లిళ్లు కావడం లేదు. అమ్మ అయ్యకు బువ్వ పెట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.
Also Read : Coimbatore Court: ఓ వ్యక్తికి 383 ఏళ్ల జైలుశిక్ష.. ఏం నేరం చేశారంటే..!
