భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు మునిగిపోయాయి… వారికి పరిహారం ఇవ్వాలని కోరుతున్నామన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. పంట పొలాలు మునిగిపోయి ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నాలుగు సార్లు రైతులు భారీ వర్షాలతో పంట నష్టపోయారని, చెక్ డ్యాం పక్కల భూములు కోతకు గురికాకుండా చెక్ డ్యాంల డిజైన్ మార్చాలని కోరుతున్నామన్నారు ఈటల రాజేందర్. వరి పంటతో పాటు కూరగాయల పంటలను ప్రోత్సహించాలని కోరుతున్నామని, రుణ మాఫీ అమలు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో సిఎం సభలో చెప్పాలని అడుగుతున్నామన్నారు.
Also Read : Raj Bhavan: ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వానికి గవర్నర్ సూచనలు.. ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన రాజ్ భవన్
అంతేకాకుండా.. విద్యా వ్యవస్థ పై దృష్టి పెట్టాలని ఈటల కోరారు. ప్రాథమిక పాఠశాలల్లో సబ్జెక్ట్ వారీగా ఉపాధ్యాయులను నియమించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగానికి కూడా ఏజెన్సీ నిర్వాహకులు లక్ష రూపాయలు తీసుకుంటున్నారని, గెస్ట్ లెక్చరర్స్ కి 12 నెలల జీతం ఇవ్వాలని కోరుతున్నారన్నారు. పాఠశాలల్లో స్కవెంజర్ లను నియమించాలని, సెకండ్ ANM ల సమస్య పరిష్కరించాలన్నారు. ‘ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన అందించాలి. ఆర్టీసీ కార్మికులకు రెండు PRC లు బాకీ ఉన్నారు… అవి చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ఏ అవసరం ఉన్న దళితులకు ఇచ్చిన భూములను తిరిగి తీసుకుంటున్నారు.
Also Read : ITR Refund Status: ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ కోసం వెయిట్ ఉన్నారా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి ?
ప్రభుత్వ భూముల అమ్మవద్దని గతంలో నిర్ణయం తీసుకున్నాం. మరోసారి ఆలోచన చేయాలి. పేదవారైనా దళితులకు మాత్రమే దళిత బంధు అమలు చేయాలని అన్ రికార్డ్ చెబుతున్నా. అర్హులైన వారందరికీ రుణాలు ఇవ్వాలని కోరుతున్నా. రేషన్ కార్డులు తక్షణమే ఇవ్వాలని కోరుతున్నా. డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట చాలా ఇబ్బంది పెడుతున్నారు. తమను అగౌరవ పరుస్తున్నారు. తమకు అసెంబ్లీలో ఒక రూం కావాలని అడిగినా పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. స్పీకర్ గా ఎమ్మెల్యేల గౌరవం కాపాడాలి.’ ఆయన కోరారు.
