ITR Refund Status: ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత రీఫండ్ కోసం వెయిట్ ఉన్నారా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ITR Refund Status: 2022-23 ఆర్థిక సంవత్సరానికి జరిమానా లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు జూలై 31తో ముగిసింది. గడువు ముగిసే సమయానికి దేశవ్యాప్తంగా 6.5 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్ దాఖలు చేశారు. ITR ఫైల్ చేసిన తర్వాత చాలా మంది రీఫండ్ పొందారు. కానీ చాలా మంది ఇంకా వాటికోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ITR ఇ-ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీకు రీఫండ్ వస్తుంది. మీకు రిఫండ్ కావాలంటే 120 రోజుల లోపు ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి.
సాధారణంగా ప్రజల మెదల్లలో మెదిలే ప్రశ్న ఏంటంటే రీఫండ్ పొందేందుకు ఎంత సమయం పడుతుంది. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే ముందు, డబ్బు వాపసు ఎవరు పొందుతారో తెలుసుకుందాం. ఏడాది పొడవునా టిడిఎస్ లేదా అడ్వాన్స్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ఎక్కువ డబ్బు డిపాజిట్ చేసిన వారందరికీ రీఫండ్ లభిస్తుంది. గతంలో వాపసు పొందేందుకు నెలల తరబడి సమయం పట్టేది. ఇప్పుడు అది 20 నుంచి 45 రోజులకు తగ్గింది. కొన్ని సందర్భాల్లో పన్ను చెల్లింపుదారులు కేవలం 10 రోజుల నుండి 14 రోజులలోపు వాపసు పొందారు. మీరు కూడా మీ ITR రీఫండ్ కోసం వేచి ఉన్నట్లయితే, దాని స్థితిని తనిఖీ చేయడానికి దశల వారీ ప్రక్రియ గురించి తెలుసుకుందాం.
Also Read
Read Also:Ustaad Bhagat Singh : సంక్రాంతి బరిలో నిలువనున్న ఉస్తాద్ భగత్ సింగ్…?
రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే..
– ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
– మీ లాగిన్ యూజర్ ID (PAN నంబర్), పాస్‌వర్డ్‌ను ఇక్కడ నమోదు చేయాలి.
– దీని తర్వాత మీరు వ్యూ రిటర్న్స్ లేదా ఫారమ్ ఎంపికను ఎంచుకోవాలి.
– కింద డ్రాప్ డౌన్ ద్వారా ఆదాయపు పన్ను రిటర్న్స్ ఎంపికను ఎంచుకోవాలి.
– దీని తర్వాత అసెస్‌మెంట్ సంవత్సరాన్ని నమోదు చేసి సమర్పించాలి.
– తర్వాత మీ ITR రసీదు సంఖ్యను ఎంటర్ చేయాలి.
– దీని తర్వాత, కొన్ని నిమిషాల్లో మీరు మీ ITR రీఫండ్ స్టేటస్ చూసుకోవచ్చు.
NSDL వెబ్‌సైట్‌లో రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి
– మీరు tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.htmlని సందర్శించండి.
– దీని తర్వాత మీ పాన్ నంబర్, అసెస్‌మెంట్ సంవత్సరం, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి.
– దీని తర్వాత, ITR వాపసు స్థితి వెంటనే మీ ముందు కనిపిస్తుంది.
Read Also:Tomato: రెండు నెలల్లో టమాటా అమ్మి కోటీశ్వరుడయ్యాడు.. కారు, ట్రాక్టర్ కొన్నాడు
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?