NTV Telugu Site icon

Etela Rajender : ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా కమిషన్‌ దుకాణాలు ఓపెన్ చేశారు

Etela

Etela

Etela Rajender : నా రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని, ఆర్థిక శాఖలో కమిషన్ లేకుండా ఒక్క బిల్లు మంజూరు చేయడం లేదన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. 7 నుంచి 10 శాతం కమిషన్ లేనిదే చిన్న బిల్లు కూడా ఇవ్వడం లేదని, ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా దుకాణాలు ఓపెన్ చేశారన్నారు. మళ్లీ దొరుకుతదొ దొరకదొ అన్నట్లు దోచుకుంటున్న ప్రభుత్వం ఇది అని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపిని ఓడించడం ఎవరితరం కాదని, రానున్న శకం బీజేపీది అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆరు నెలలు హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చే ప్రయత్నం చేసిందని, మరో ఆరు నెలలు మూసి పక్కన ఇండ్లను కూల్చే ప్రయత్నం చేసిందన్నారు. నేడు 1985 నుంచి నేటి వరకు స్థలాలు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్న జవహర్ నగర్ ను కూల్చే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. జవహర్ నగర్ లో అన్ని ప్రాంతాల వారు, అన్ని పనులు చేసే వారు ఉన్నారని, ఇక్కడి స్థలాలు అక్రమంగా కబ్జాలు చేసినవి కాదన్నారు ఎంపీ ఈటల రాజేందర్‌.

 
Ajit Pawar: సైఫ్ అలీ ఖాన్ నిందితుడి గురించి కీలక విషయం చెప్పిన అజిత్ పవార్..
 

అంతేకాకుండా..’జవహర్ నగర్ చరిత్ర రాష్ట్రానికి తెలియదు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం 5977.3 ఎకరాల భూమిని సైనికులకోసం అక్వైర్ చేసిన భూమి. ఈ భూములన్నీ నాటి మిలటరీ ఆద్వర్యంలో ఉన్న భూములు. ఈ భూములకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ భూములన్నీ రక్షణ శాఖకు సంబంధించినవి. 1951 meo సికింద్రబాద్ రాష్ట్ర ప్రభుత్వానికి కేర్ టేకర్ గా ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి కావు. నాడు మాజీ సైనికులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు గా చేస్తే అప్పో సప్పో చేసి ప్రజలు ప్లాట్లుగా కొన్నారు. రేవంత్ సర్కార్ వచ్చిన తరువాత వాటిని కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు డోజర్లు వస్తాయో, ఎప్పుడు పోలీసులు వస్తారినని ప్రజలు బిక్కు బిక్కుమని బ్రతుకుతున్నారు. జవహర్ నగర పక్కనే అరుంధతి నగర్లో కట్టుకుంటున్న ఇండ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నారు.

రేవంత్ సర్కార్ కు అడ్మినిస్ట్రెషన్ పై పట్టు ఉందా లేదా..? రేవంత్ రెడ్డికి అధికారులు సహాకరిస్తున్నారా లేదా..? జవహర్ నగర్ , బాలాజీ నగర్, అరుంధతి నగర్ లో 50 వేల నుంచి 2 లక్షల వరకు లంచం ఇస్తే తప్ప అక్కడ ఇండ్లు నిర్మించే ఆస్కారం లేదు.. మొత్తం బ్రోకర్ వ్యవస్థ రాజ్యమేలుతోంది.. సైనికుల సొసైటీకి సంబంధించిన భూములపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఎందుకు..? పేదల ఇండ్లను కూల్చడం ప్రభుత్వం లక్ష్యమా..? ఎకరాలు కొద్ది భూములను కబ్జాలు చేసిన వారిని వదిలేసి గజాలలో కట్టుకున్న ఇండ్లు కూల్చుతారా..? పేదల ఇండ్లను కూల్చేతే సహించేది లేదు.. డంప్ యార్డ్ పక్కన ఉన్న ప్రజల ఇండ్లను కూడా వదలరా..? రేవంత్ సర్కార్ నిజాం సర్కార్ కాదు, ఎవరి జాగీరు కాదు.. మా పార్టీ బలోపేతం జీర్ణించు కోలేనివారు అనేక విష ప్రచారాలు చేస్తారు.. ప్రభుత్వంలో చిన్న బిల్లు విడుదల చేయాలన్న 7 నుంచి 10 శాతం కమిషన్ అడుగుతున్నారు.. నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇట్లాంటి అసమర్థ, వైఫల్యం చెందిన, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు.. కాళేశ్వరం విచారణకు సాహాకరిస్తారా అన్న ప్రశ్నకు.. కాళేశ్వరం విచారణకు పిలిస్తే వెళ్తా. కాళేశ్వరం విచారణపై ప్రోటోకాల్ తెలియని వారు అవగాహన లేని వారు ఏదేదో మాట్లాడుతున్నారు.. నాటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు నేటి ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు చాలా వ్యత్యాసం ఉంది.. అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేని వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు.. రాబోవు కాలంలో బీజేపీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు’ అని ఈటల రాజేందర్‌ అన్నారు.

 
Bhanu Chander: ఏపీలో సినీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తాం..